Borugadda Anil kumar: రౌడీ షీటర్, వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని ధర్మాసనంలో అనిల్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారంతో బెయిల్ ముగియడంతో.. ఇంత వరకూ అనిల్ జైలుకు వెళ్లలేదు. ఈ విషయం జైలు అధికారులు హైకోర్ట్ కు తెలియ చేశారు. దీంతో బోరుగడ్డపై సీరియస్ అయ్యింది ఉన్నత న్యాయస్థానం. ఒక వేళ బోరుగడ్డ లొంగిపోకుంటే.. ఏం చేయాలో ప్రణాళిక రచిస్తున్నారు అధికారులు.
ఈ సరికే అతడికి పూచీకత్తు ఇచ్చిన వారి వివరాలను పోలీసులకు అందించారు జైలు అధికారులు. ఈ తరుణంలో మంగళవారం విచారించిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ గడువు పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. అవసరమైతే చెన్నై నుంచి వచ్చి ఫ్లైట్‌లో వచ్చి లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు సీరియస్ వార్నింగ్‌తో బోరుగడ్డకు మళ్లీ చిక్కులు తప్పవని, ఉచ్చు బిగుస్తున్నట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
“కాగా మధ్యంతరం బెయిల్ పొడిగింపు లేదని హైకోర్టు చెప్పడంతో మరో ఆప్షన్ లేక .. రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో.. మీడియా కంటపడకుండా బుధవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని.. సూపరింటెండెంట్‌కు బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు.”
ఇదిలా ఉంటే.. బోరగడ్డ అనిల్ సరెండర్ అవ్వడానికి ముందు రెండు రోజుల నుంచి పెద్ద డ్రామా నడించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో బోరగడ్డ అనిల్ గత కొంతకాలంగా జైలులో ఉన్నారు. అయితే తన తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని సాయంగా ఉండాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో గుంటూరు లలితా సూపర్స్ స్పెషాలిటీ ఆస్పత్రి సిఫార్సు చేసినట్లు మెడికల్ సర్టిఫికెట్ కూడా కోర్టుకు సమర్పించాడు. దీంతో మానవత్వంతో మార్చి1న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ మెడికల్ సర్టిఫికెట్ తామివ్వలేదని ఆసుపత్రి అధినేత రాఘవశర్మ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో బోరుగడ్డ అడ్డంగా బుక్కయ్యాడు. తప్పుడు వైద్య ధ్రువ పత్రంతో బెయిలు గడువు పొడిగించుకున్న విషయాన్ని పోలీసులు ప్రభుత్వ న్యాయవాదికి , కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఈ మోసంపై హైకోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉందని, కేసు నమోదుకు ఆదేశించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, తమ ఆసుపత్రి పేరుతో లెటర్ హెడ్ సృష్టించినందుకు గాను లలితా ఆసుపత్రి యాజమాన్యం కూడా అనిల్‌పై ఫిర్యాదు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు గుంటూరులో మరో చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు కూడా నమోదయ్యింది. అనిల్ ఒకవేళ జైలులో లొంగిపోకపోతే హైకోర్టు ఇచ్చే ఆదేశాల అమలుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
Also Read: సీఎం చంద్రబాబుకు మంత్రి కొండా సురేఖ లేఖ
తల్లికి సహాయంగా ఉండాలని చెప్పి జైలు నుంచి బయటకొచ్చిన అనిల్ ఇన్నాళ్లు ఎక్కడున్నాడు? ఎవరెవరిని కలిశాడు? ఎవరితో ఫోన్లో మాట్లాడాడు? అనేదానిపై పోలీసులు సమాచారం సేకరించారు. మరోవైపు అనిల్‌పై పట్టాభిపురం పీఎస్‌లో పీటీ వారంట్ పెండింగ్‌లో ఉండగా.. కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఓ పాస్టర్‌ను బెదిరించిన ఘటనలో అనిల్‌పై పట్టాభిపురం స్టేషన్‌లో పీటీ వారంట్ పెండింగ్‌లో ఉంది. కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఫైల్ సిద్ధం చేశారు. మొత్తానికి చూస్తే లొంగిపోయినా సరే అనిల్‌కు కష్టాలు తప్పేలా లేవు.