BigTV English

YS Jagan: తాటిపత్రి ట్వీట్.. జగన్‌కు కొత్త తలనొప్పి

YS Jagan: తాటిపత్రి ట్వీట్.. జగన్‌కు కొత్త తలనొప్పి

YS Jagan: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పాల్గొనే అర్హత కూడా లేకుండా పోయింది. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పార్టీ చేతులెత్తేసింది.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవడమే ఆ పార్టీకి పెద్ద సవాల్‌గా మారనుంది.. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఆ ఎమ్మెల్యేని, ఆ పార్టీని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకుంటున్నారు. సమయం, సందర్భం లేకుండా ప్రతి విషయాన్ని పాలిటిక్స్‌తో ముడిపెడుతూ తాటిపర్తి పెడుతున్న పోస్టులతో సొంత పార్టీ వారే తలలు పట్టుకుంటున్నారంట.. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఏం చేశారు? ఎందుకంత ట్రోల్ అవుతున్నారు?


వైసీపీకి ఉన్న 11మంది ఎమ్మెల్యేల టీమ్‌లో ఒకరైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నా రూటే సెపరేటు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రతపక్ష ఎమ్మెల్యేగా బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. చంద్రశేఖర్ ఓవర్ యాక్షన్‌తో ఎప్పటికప్పుడు సీన్ రివర్స్ అవుతూనే వస్తుంది. దేనికి స్పందించాలి, ఎలా స్పందించాలని తెలియకుండా పెడుతున్న పోస్టులతో సోషల్ మీడియాలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ను నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు .

దుబాయ్ వేదికగా ఈ నెల మార్చి 9 న జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్ టీమ్ గా నిలిచింది. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు అన్ని వర్గాల నుంచీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశం యావత్తూ ఈ చారిత్రాత్మక విజయంతో సంబరాలు చేసుకుంది. ఈ విజయాన్ని వైసీపీ శ్రేణులు కూడా ఆస్వాదించాయి. అయితే ఈ సందర్భాన్ని వైసిపి పార్టీకి బూస్ట్ వచ్చే విధంగా మలచుకోవడానికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ ఆ పార్టీని నవ్వుల పాలు చేసింది.


చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాను తాటిపర్తి చంద్రశేఖర్ అభినందిస్తూనే.. పనిలో పనిగా గత ఎన్నికలలో తమ పార్టీ గెలిచిన 11 స్థానాలను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన టీమ్ ఇండియా ఎలాంటి పొత్తులూ లేకుండా కేవలం 11 మందితో ఆడి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందనీ, అదే విధంగా 2029 ఎన్నికలలో వైసీపీ విజేతగా నిలుస్తుందనీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. టీమ్ ఇండియాకు పొత్తులేంటో? ఆయన ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చారో? కాని తన పోస్టుని సేవ్ చేసిపెట్టుకోమని ఒక సలహా కూడా పారేశారు.

Also Read: కోడెలపై కుట్ర.. ఇవిగో నిజాలు

ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పెట్టిన ఈ పోస్టు ఓ రేంజ్ లో ట్రోలింగ్ అవుతుంది. ఆటల్లో పొత్తులుండవు గురూ.. అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లైనా గెలిచే అవకాశం ఉంటుందా అంటు మరి కొందరు ఎద్దేవా చేశారు. ఎవరి పొత్తూ లేకుండా టీమ్ ఇండియా 11 మంది సభ్యులతో నిజాయితీగా కప్ గెలిచింది. నాలుగేళ్ల తరువాత ఏపీలో ఇదే రిపీట్ అవుతుంది అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఎవరితో పొత్తు లేకుండా.. అంటే ఎలాంటి మ్యాచ్ ఫిక్స్ంగ్‌కి పాల్పడకుండా ఇండియా చాంపియన్స ట్రోఫీ గెలిచిందని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు.

అయితే ఆయన ప్రత్యేకంగా 11 మందే .. అంటూ ఆటగాళ్ల సంఖ్యను కూడా పేర్కొనడం, అది గత ఎన్నికలలో వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్యే కావడంతో నెటిజన్ల ఒక రేంజ్లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. పాపం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్నీ, విశ్వాసాన్ని నింపడానికి టీమ్ ఇండియా విజయానికి, పాలిటిక్స్‌తో ముడిపెట్టి చేసిన ట్వీట్ అలా బూమరాంగ్ అయిందిప్పుడు. టీమ్ ఇండియా ఎప్పుడూ వైనాట్ 175 అనలేదనీ ఎన్డీయే మద్దతు దారులు ఎద్దేవా చేస్తున్నారు. పబ్లిసిటీ కొసం సోషల్ మీడియాలో హాఫ్ నాలెడ్జ్‌తో పోస్టులు పెడితే ఇలాగే ఉంటుందని నెటిజన్లు విసురుతున్న పంచ్‌లతో వైసీపీ వర్గాలే తలలు పట్టుకుంటున్నాయంట.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×