BigTV English

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ?

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ?

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్యసత్యనారాయణ సతీమణి డాక్టర్‌ ఝాన్సీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివీ సత్యనారాయణ ఈస్ట్ అసెంబ్లీకి పోటీ చేస్తుండడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం.. సుదీర్ఘ చర్చల అనంతరం బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించింది. ఉన్నత విద్యావంతురాలు కావడంతోపాటు.. ఉత్తరాంధ్ర కాపు సామాజికవ వర్గం కావడం సానుకూల అంశంగా భావించింది. దీంతోపాటు రాజకీయ అనుభవం ఉండటంతో బొత్స ఝాన్నీని ఎంపీ అభ్యర్థిగా ఎంపికి చేసినట్టు సమాచారం. గతంలో జడ్పీ చైర్మన్‌గా, రెండుసార్లు లోక్ సభ ఎంపి గా పని చేశారు.


కాగా.. ఝాన్సీ పోటీ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందన్న ఆలోచనలో ఉంది అధికార పార్టీ. స్థానిక బీసీ నేతకు సీటు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలోని 80 శాతం బీసీలను ప్రభావితం చేయవచ్చని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్‌ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్నీ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఝాన్సీ అభ్యర్థిత్వంతో మిగతా పార్టీలు కూడా బీసీ నేతలకు ఇవ్వాల్సి వస్తుందన్న రాజకీయ ఎత్తుగడ కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు విశాఖ లోక్‌సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారే ఉన్నారు. 2004 లో నేదురుమల్లి, 2009లో పురంధరేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ ఎంపీగా ఎన్నికయ్యారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×