E-Paper
Advertisement

CM Revanth Reddy: నెల రోజుల పాలనపై.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు పాలన పూర్తి అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నెల రోజులు పాలన ప్రజలు ఆకాంక్షలు నిజం చేస్తూ ఈ ప్రస్థానం తనకు సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు.

CM Revanth Reddy: నెల రోజుల పాలనపై.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నెల రోజుల పాలనలో ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ వచ్చిన ఈ ప్రస్థానం తనకు సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు.

“సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది.
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.
పేదల గొంతుక వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ.. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ.. రైతుకు భరోసా ఇస్తూ.. సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది.
పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ.. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా”. అని సీఎం రేవంత్ రెడ్డి X వేదికగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement


Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×