E-Paper
Advertisement

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్
Advertisement

Tension in Tadipatri: స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కేడర్ని నేతలను అలర్ట్ చేస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలీదు. అర్ధరాత్రి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ విషయం తెలియగానే పోలీసులు షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

తాడిపత్రిలో మళ్లీ టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. భగత్‌సింగ్ నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. వాహనంపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనం ధ్వంసం

Advertisement

అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో అక్కడికి చేరుకుని రాళ్లు, ఇనుప రాడ్లుతో వాహనంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వాహనం అద్దాలను పగలగొట్టడంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. వెంటనే అలర్టయిన స్థానికులు-సిబ్బంది అక్కడికి వచ్చేసరికి దుండగులు పరారయ్యారు. దీని గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. వాహనం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఆరా

అలాగే ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. వాహనం ధ్వంసానికి ఉపయోగించిన వస్తువులు, అక్కడ సంచరించిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చారా? అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

ALSO READ: ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

పెద్దారెడ్డి వాహనం లక్ష్యంగా దాడి జరగడం తాడిపత్రిలో కాసింత టెన్షన్ నెలకొంది. దీని వెనుక ప్రత్యర్థుల ప్రమేయం ఉందా? అంటూ స్థానికంగా నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో తాడిపత్రిలో జరిగిన పరిణామాలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు. ఘటన నేపథ్యంలో తాడిపత్రి పోలీసులు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు.

 

Related News

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం.. పొలంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు దుర్మరణం!

వైసీపీలో తీవ్ర ఉక్కపోత .. జగన్‌కు షాక్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్, ఉత్తరాంధ్ర నుంచి ఓ మాజీ మంత్రితోపాటు..

విశాఖలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య.. విచారణకు మంత్రి ఆదేశం, మృతురాలి సొంతూరు హైదరాబాద్

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం!

Big Stories

Advertisement
×