E-Paper
Advertisement

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!
Advertisement

Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డీబీఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ పక్క స్థలంలో భవన నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా ఒక క్రేన్ ఉన్నపళంగా కూలిపోయింది. మట్టి తోడుతున్న సమయంలో క్రేన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి గుంటలోకి పడిపోయింది. ఈ ఊహించని ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఒడిశాకు చెందిన కూలీ రామారావు (45), శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ఇంజినీర్ సందీప్ (34), తిరుపతికి చెందిన గార్డెన్ వర్కర్ చెంగయ్య (40) మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్రేన్ కూలడానికి గల అసలు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Also Read: దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

Tags

Related News

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం.. పొలంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు దుర్మరణం!

వైసీపీలో తీవ్ర ఉక్కపోత .. జగన్‌కు షాక్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్, ఉత్తరాంధ్ర నుంచి ఓ మాజీ మంత్రితోపాటు..

విశాఖలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య.. విచారణకు మంత్రి ఆదేశం, మృతురాలి సొంతూరు హైదరాబాద్

Big Stories

Advertisement
×