Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ త్వరలోనే తమ వినియోగదారుల ముందుకు మరికొన్ని కొత్త పరికరాలను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా గెలాక్సీ S26 FE స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ట్యాబ్ S12+తో పాటు బడ్జెట్ రేంజ్‌లో గెలాక్సీ A07s పరికరాలు త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఇవన్నీ గూగుల్ ప్లే కన్సోల్ సపోర్టెడ్ డివైసెస్ లిస్ట్‌లో కనిపించడంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి మొదలైంది.
శాంసంగ్ తమ పాపులర్ Fan Edition సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S26 FEని తీసుకొస్తోంది. ఈ మోడల్ వివిధ దేశాలకు అనుగుణంగా ఐదు విభిన్న మోడల్ నెంబర్లతో గూగుల్ ప్లే కన్సోల్‌లో నమోదైంది. అమెరికా, కెనడా, దక్షిణ కొరియా, అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రత్యేక వేరియంట్లను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మిగతా ఫీచర్లు మాత్రం ఇంకా తెలియరాలేదు.
Also Read: ఫోన్‌తో పనిలేకుండా మీటింగ్ రికార్డింగ్, లైవ్ ట్రాన్స్‌లేషన్.. రూ.12,499కే ఏఐ ఇయర్ బడ్స్!
టాప్‌ఎండ్ ట్యాబ్లెట్ ప్రియుల కోసం రాబోతున్న గెలాక్సీ ట్యాబ్ S12+ రెండు వేరియంట్లలో లభించనుంది. ఇది వైఫై మాత్రమే కాకుండా 5జీ సపోర్ట్‌తో కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే భారత్‌కు చెందిన BISతో పాటు అమెరికా, దక్షిణ కొరియా సర్టిఫికేషన్ సంస్థల వద్ద ఈ ట్యాబ్ కనిపించింది. సర్టిఫికేషన్లు పూర్తవుతుండటంతో దీని లాంచ్ చాలా దగ్గరలోనే ఉండే అవకాశం ఉంది.
తక్కువ ధరలో కొత్త ఫోన్ కోరుకునే వారి కోసం శాంసంగ్ గెలాక్సీ గ్యాలాక్సీ A07s మోడల్‌ను సిద్ధం చేస్తోంది. గూగుల్ లిస్టింగ్‌లో కనిపించిన ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లతో పాటు లాటిన్ అమెరికా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్ విభాగంలో గట్టి పోటీనిచ్చేలా దీనిని రూపొందిస్తున్నట్లు సమాచారం.
డివైస్ వివరాలు, సర్టిఫికేషన్లు బయటకు వచ్చినప్పటికీ.. శాంసంగ్ సంస్థ ఇప్పటివరకు ఈ పరికరాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్లు, ట్యాబ్లెట్ల ధరలు, పూర్తి ఫీచర్లు అలాగే ఇవి ఎప్పుడు మార్కెట్లోకి విడుదలవుతాయనే విషయాలపై కంపెనీ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: అబ్బా.. గూగుల్ ఏం ప్లాన్ చేసింది మావా.. Pixel Buds Pro 2లో దిమ్మతిరిగే ఫీచర్లు!