E-Paper
Advertisement

ఎమ్మెల్సీ బరిలో ఆ ఇద్దరు నేతలు.. రేవంత్ రెడ్డి మార్క్ మాస్టర్ ప్లాన్!

ఎమ్మెల్సీ బరిలో ఆ ఇద్దరు నేతలు.. రేవంత్ రెడ్డి మార్క్ మాస్టర్ ప్లాన్!
Advertisement

MLC Elections: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మరో సంచలన వ్యూహానికి తెరలేపింది. పార్టీని నమ్ముకున్న కష్టజీవులకు, పార్టీ జెండాను గుండెలకు హత్తుకుని నడిచిన అంకితభావం గల నేతలకు పట్టం కడుతూ అధిష్టానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాబోయే తెలంగాణ శాసనమండలి (ఎమ్మెల్సీ) గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతూ అభ్యర్థుల అధికారిక జాబితాను విడుదల చేసింది.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్రతో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఈ మేర‌కు అధికారిక నోట్ జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, గ్రాడ్యుయేట్లు, యువత, నిరుద్యోగుల గొంతుకై నిలిచే నాయకులనే బరిలోకి దింపడం ద్వారా రెండు స్థానాల్లోనూ విజయ దుందుభి మోగించేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ సర్వే అనంతరం రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్లకు అవకాశం ఇచ్చారు.

మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ కు సామా రామ్మోహన్ రెడ్డి

Advertisement

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ మాజీ మీడియా కమిటీ చైర్మన్, స్పోక్స్ పర్సన్ సమ రామ్మోహన్ రెడ్డిని ఎంపిక చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలంలో, పార్టీ ఉనికికే సవాళ్లు ఎదురైన సమయం నుంచి తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి రామ్మోహన్ రెడ్డి అహరహం శ్రమించారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, టీవీ డిబేట్లు , ప్రజాక్షేత్రంలో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ , అప్పటి అధికార పార్టీ బి ఆర్ ఎస్ పై నిత్యం ఎదురు దాడికి దిగారు. తనుకున్న వాక్చాతుర్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం , తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండ కట్టారు. సర్కార్ ఏర్పడిన తర్వాత కూడాసీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన ముందు వరుస లో నిలిచారు. అంతేగాక మహబూబ్‌నగర్, రంగారెడ్డి ,హైదరాబాద్ జిల్లాల వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థి లోకం, మేధావులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీకి చేసిన నిరంతర సేవలకు, చూపిన విధేయతకు తగిన గుర్తింపుగా అధిష్టానం ఆయనను గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

నల్గొండ – ఖమ్మం -వరంగల్ కు రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి!

Advertisement

నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల స్థానానికి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ఎంపిక చేస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ కాంగ్రెస్ దిగ్గజం, దివంగత రామ్‌రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నారు.దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను వీడకుండా నిలబడిన ఈ కుటుంబానికి దక్కిన గౌరవంగా ఈ ఎంపికను భావిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ వంటి చైతన్యవంతమైన జిల్లాల పరిధిలో రామ్‌రెడ్డి కుటుంబానికి బలమైన ప్రజాదరణ, కేడర్ నెట్‌వర్క్ ఉంది. ఉద్యోగ, ఉపాధి రంగాల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న సర్వోత్తమ్ రెడ్డిని బరిలోకి దింపడం ద్వారా తన ఓటు బ్యాంకును మరింత భద్రపరుచుకుంటున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది.

కార్యకర్తలకు భరోసా..

ఈ నిర్ణయంతో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పెనలా మారింది. “పార్టీని నమ్ముకుని పనిచేస్తే కచ్చితంగా గుర్తింపు లభిస్తుంది” అనే బలమైన సంకేతాన్ని ఈ ఎంపిక ద్వారా అధిష్టానం పంపింది. వాస్తవానికి ఈ రెండు స్థానాల కోసం చాలామంది సీనియర్ నేతలు ప్రయత్నించినప్పటికీ, పార్టీ విధేయతకి పట్టం కట్టింది.రెండు ప్రధాన పట్టభద్రుల స్థానాల్లోనూ అపార ప్రజాదరణ పొందిన నేతలను నిలబెట్టడంతో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు గండి పడినట్లయింది. పట్టభద్రులంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, భారీ మెజార్టీతో ఈ రెండు శాసనమండలి స్థానాలను కైవసం చేసుకుని మండలిలో ప్రజా గొంతుకను మరింత వినిపిస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రాహుల్ కాదు కదా.. ఆయన జేజమ్మ వచ్చినా మోడీని ఏమీ చేయలేరు: ఈటల రాజేందర్

Tags

Related News

నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?

మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!

రాహుల్ కాదు కదా.. ఆయన జేజమ్మ వచ్చినా మోడీని ఏమీ చేయలేరు: ఈటల రాజేందర్

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

Big Stories

Advertisement
×