BigTV English

Jagan comments Botsa tears: కంటతడి పెట్టిన బొత్స, కారణం అదేనా?

Jagan comments Botsa tears: కంటతడి పెట్టిన బొత్స, కారణం అదేనా?

Jagan comments Botsa tears: ఎన్నికలంటే ఆ మజాయే వేరు. అధికార- విపక్షాల మధ్య మాటలు యుద్ధం ఓ రేంజ్‌లో ఉంటుంది. చదరంగం గేమ్ మాదిరిగానే ఎత్తుకు పైఎత్తులు వేస్తాయి ఇరు పార్టీలు. ఎమోషన్స్, కన్నీళ్లకు ఏమాత్రం తావు ఉండదు. కన్నీరు పెట్టారంటే పెద్ద కారణం ఉండాలి.. లేకపోతే ఓటమిని అంగీకరించినట్టేనని చెబుతుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా విజయనగరంలో ఓ విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది.


విజయనగరం జిల్లా చెల్లూరు కూడలిలో సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడారు. తామే ఎక్కువ చేశాము.. విపక్ష టీడీపీ ప్రజలకు ఏమీ చేయలేదని అధికారంలో ఉన్ననేతలు ఈ తరహా మాటలు చెప్పడం సహజం. అవన్నీ చెబుతూ మంత్రి బొత్స సత్యనారాయణ కంట కన్నీరు పెట్టించారు జగన్. సభలో పక్కనున్న బొత్స సత్యనారాయణను చూపిస్తూ ఆయన తనకు తండ్రిలాంటి వారని, కానీ తనను అన్న అని పిలుస్తారన్నారు సీఎం జగన్.

మంచివాడు, సౌమ్యుడు, మీకు తెలిసినవాడు అంటూనే బొత్సను నియోజకవర్గం ప్రజలకు పరిచయం చేశారు ముఖ్యమంత్రి. ఆ సమయంలో జగన్ అనురాగం, ఆప్యాయత, ప్రేమకు ఫిదా అయిపోయిన బొత్స కన్నీరు ఆపుకోలేకపోయారు… కంటతడి పెట్టేశారు. చివరకు జగన్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించారు. ఆ సభలో బొత్స కంటనీరు పెట్టడాన్ని పలువురు వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరుపదుల వయసున్న పెద్దాయన చేతులు పట్టుకుని ఏడిపించడం బాగా లేదంటున్నారు. జగన్‌కు అంత అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఉంటే చెల్లెళ్లకు న్యాయం చేయవచ్చు కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు పలువురు కార్యకర్తలు.


ఆరుపదుల వయస్సు రావడంతో ఈసారి బొత్స.. తన కొడుకును ఎన్నికల బరిలోకి దింపాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బొత్స కొడుకు ఫెక్సీలే కనిపించేవి. నియోజక వర్గంలో పలుమార్లు తిరిగారు కూడా. అయితే ఈసారి వారసులకు టికెట్లు లేవని, సీనియర్ నేతలు పోటీ చేయాల్సిందేనని అధినేత ఓపెన్‌గా చెప్పిన తర్వాత నుంచి బొత్స కాస్త డల్‌గా కనిపించారన్నది ఆ పార్టీలోని నేతలు అంటున్నారు. ఈ క్రమంలో ఆనారోగ్యం నిమిత్తం బొత్స హైదరాబాద్‌కు వెళ్లడం జరిగిపోయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వైసీపీలో అంత యాక్టివ్‌గా లేదన్నది కొందరి నేతల వాదన.

ALSO READ: ఏపీ ఎలక్షన్ హిస్టరీలో ఓ రికార్డు.. మనీ, బంగారం, డ్రగ్స్ అన్నీ కలిసి..

మొత్తానికి ప్రజల సెంటిమెంట్ కోసం జగన్ అలాంటి డైలాగ్స్ కొట్టారని అంటున్నారు. అన్నట్లు ఈ మధ్య ఏ సభలో చూసినా జగన్ నోటి వెంట సౌమ్యుడు అనే పదం బాగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ నోటి వెంట విశ్వసనీయత అనేది ఎక్కువగా వినబడేది.

 

Related News

Vizag real estate: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా? ఇదే ఛాన్స్!

CM Chandrababu: పెద్దాపురంలో కలకలం.. చంద్రబాబు కాన్వాయ్ ఆపిన భూమి బాధితుడు!

Kotamreddy Sridharreddy: ఇది నాకొక పాఠం.. ఇకపై పెరోల్ కోసం ఎవ్వరికీ లేఖలు ఇవ్వను

Amaravati Central Library: అమరావతిలో హైటెక్ హంగుల లైబ్రరీ.. దీని స్పెషాలిటీ ఏమిటంటే?

TTD Treasury: వెంకన్న ఖజానాలో ఉన్న బంగారం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

Nara Lokesh: నైపుణ్యం పోర్టల్.. ఏపీలో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందా?

Big Stories

×