OnePlus 13 : టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ తాజాగా వన్ ప్లస్ 13 సిరీస్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ ఈ రోజు ఇండియాలో ప్రారంభమైంది. ఇక ఈ ఫస్ట్ సెల్ లో వన్ ప్లస్ ఆఫర్స్ ను అదరగొట్టేసింది. ఈ మొబైల్ ను మీరూ సొంతం చేసుకోవాలనుకుంటే ధరతో పాటు ఫుల్ ఆఫర్స్ పై ఓ లుక్కేసేయండి.
తాజాగా ఇండియాలో లంఛ్ అయిన వన్ ప్లస్ 13 సిరీస్ ఫీచర్స్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొన్న ఈ మొబైల్ కు ఇండియాలో సైతం అదే రేంజ్ లో డిమాండ్ కనిపిస్తోంది. ప్రమఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తో పాటు వన్ ప్లస్ రిటైల్ స్టోర్స్ లో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చేసింది. ఇక ప్రారంభ ధర రూ. 69,999గా ఉంది. ఇక ఫస్ట్ సేల్ తోనే యూజర్స్ ను ఆకట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న వన్ ప్లస్ అదిరిపోయే డీల్స్ ను తీసుకొచ్చేసింది.
వన్ ప్లస్ 13 ధర విషయానికి వస్తే.. 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 12GB RAM వేరియంట్ భారతీయ మార్కెట్‌లో రూ.69,999గా ఉంది. 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న 16GB RAM వేరియంట్ ధర రూ.76,999గా ఉంది. ఇక 24GB RAM తో 1TB మోడల్ హై-ఎండ్ వేరియంట్ ధర రూ. 89,999గా ఉంది.
OnePlus 13 Offers –
ఇక అదిరిపోయే ఫీచర్స్ తో వచ్చేసిన ఈ మొబైల్ ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ వన్ ప్లస్ ఆఫర్స్ ను బెస్ట్ గా అందిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. ఈ సిరీస్ లో మూడు మోడల్స్ పై వన్ ప్లస్ ఈ ఆఫర్ ను అందిస్తుంది. ఇక ఇనిస్టెంట్ డిస్కౌంట్ సైతం అందిస్తోంది. ఇక పాత మొబైల్స్ ను మార్చి కొత్త మొబైల్ కు అప్ గ్రేడ్ అవ్వాలనుకునే వినియోగదారులకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఎక్సేంజ్ ఆఫర్ లో రూ. 18000 వరకు తగ్గింపును ఇస్తోంది. అంతేకాకుండా అమెజాన్ సైతం అదనంగా రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్ తో 12GB RAM వేరియంట్‌ను రూ. 39,999కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది.
OnePlus 13 Features –
వన్ ప్లస్ 13 ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.82 అంగుళాల LTPO QHD + డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits గరిష్ట బ్రైట్నెస్ తో వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో కెమెరా ఫీచర్స్ సైతం అదిరేలా ఉన్నాయి. 50MP LYT-808 ప్రైమరీ షూటర్, 50MP టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ALSO READ : స్మోకింగ్ మానేయలేకపోతున్నారా? ఈ స్మార్ట్‌వాచ్ హెల్ప్ తీసుకోండి