BigTV English

AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు షాకింగ్ న్యూస్.. ఆ జీవో జారీ చేయాలంటున్న బ్రాహ్మణ చైతన్య వేదిక.. ప్రభుత్వం ఎలా స్పందించెనో ?

AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు షాకింగ్ న్యూస్.. ఆ జీవో జారీ చేయాలంటున్న బ్రాహ్మణ చైతన్య వేదిక.. ప్రభుత్వం ఎలా స్పందించెనో ?

AP Liquor Policy: మద్యం షాపులు తెరవండి.. త్రాగే వారు వస్తారు.. లేకుంటే లేదు కానీ.. ఆ ఒక్క పని చేశారో సహించేది లేదంటున్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు. ఇటీవల ఏపీలో నూతన మద్యం పాలసీకి సంబంధించిన మొత్తం ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రంలో మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చేందుకు అధికారులు ఇటీవల లాటరీ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. ఇక 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. నూతన మద్యం పాలసీతో ప్రభుత్వానికి ఆదాయం రాగా.. అదృష్టం వరించిన మద్యం షాప్ లైసెన్స్ దారులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ లాటరీ పద్ధతిలో ఛాన్స్ దక్కని దరఖాస్తుదారులు నిరాశకు గురైన పరిస్థితి ఆయా జిల్లాల్లో కనిపిస్తూ ఉంది.


ఇక 16వ తేదీ నుండి మద్యం షాపులు నూతన పాలసీ ప్రకారం ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో లైసెన్స్ దక్కించుకున్న వారు నిమగ్నమయ్యారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం నూతన మద్యం పాలసీకి సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేసి.. ఇప్పటికే మద్యం నిల్వలను సైతం రెడీ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బ్రాండెడ్ మద్యంను మందుబాబుల ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. అయితే రేపటి నుండే మద్యం దుకాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ కీలక ప్రకటన చేశారు.

శ్రీధర్ మాట్లాడుతూ… రేపటి నుండి మద్యం షాపులు ప్రారంభమవుతున్న సందర్భంలో, మద్యం షాపులకు వివిధ మతాలకు చెందిన దేవుళ్ల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నాటి టిడిపి ప్రభుత్వం.. గతంలో మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు పెట్టరాదని జీవో జారీ చేసిందని, అదే జీవోను ప్రభుత్వం కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆ జీవోతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని, ఆధ్యాత్మికత గౌరవాన్ని సైతం చాటి చెప్పినట్లుగా ఉంటుదన్నారు.


Also Read: CM Chandrababu: ఆ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఫస్ట్ టైమ్ సీఎం చంద్రబాబు సీరియస్.. 18న కూడా ..?

దేవుళ్ల పేర్లతో ఈ అపచారం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎవరైనా మద్యం షాపులకు దేవుళ్ల పేర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ మతాల ప్రార్ధనాలయాలు, ప్రార్థన స్థలాల వద్ద షాపులు ఏర్పాటు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దానితో పాటు దేవుళ్ళు, స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల పేర్లు లేకుండా, కేవలం ఫ్యాన్సీ పేర్లతోనే మద్యం షాపులకు పెట్టాల్సిన పేర్లపై గత జీవో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని, ప్రభుత్వం తరఫున ప్రకటన జారీ చేయాలన్నారు.

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×