BigTV English

Byreddy: రంగం సినిమాలో విలన్ లా పవన్.. బైరెడ్డి ఆన్ ఫైర్.. జనసైన్యం అటాక్

Byreddy: రంగం సినిమాలో విలన్ లా పవన్.. బైరెడ్డి ఆన్ ఫైర్.. జనసైన్యం అటాక్

Byreddy: బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి. సోషల్ మీడియాలో హీరో. పిచ్చ ఫాలోయింగ్. షార్ట్స్, రీల్స్ లో అతనిదే హంగామా. యూత్ లో యమా క్రేజ్. అతని డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉంటాయి. విజయ్ దేవరకొండలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. మనసులో ఏదీ దాచుకోడు. వైసీపీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా అభిమానులూ ఎక్కువే. సిద్దార్ద్ రెడ్డి దూకుడుకు మెచ్చి.. జగనన్న అతన్ని శాప్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నట్టు ఉన్నాడు బైరెడ్డి.. ఈ మధ్య పొలిటికల్ పంచ్ లు బాగా పేలుస్తున్నాడు.


జగన్ తెలంగాణలో అడుగుపెడితే ప్రకంపణలే అంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్ కే వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు బైరెడ్డి. ఏపీలో బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూస్తామన్నారు. కేసీఆర్ నే అన్నవాడు.. పవన్ కల్యాణ్ ను అనకుండా ఊరుకుంటాడా? జనసేనానిపైనా నోరు పారేసుకున్నాడు బైరెడ్డి. జగన్ కు ప్రైవేట్ సైన్యం ఉందని.. జగన్ విషయంలో ఎవరైనా వేలు పెడితే ఊరుకోమంటూ బెదిరించినట్టు మాట్లాడారు. పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు గుర్తున్నాయా? అని విమర్శించారు. దేశంలో అత్యంత అవినీతి పరుడైన చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పవన్ ను ఉద్దేశించి బైరెడ్డి చేసిన ఓ కామెంట్ మరింత కాక రేపుతోంది. రంగం సినిమాలో విలన్ లా పవన్ కల్యాణ్ ప్రవర్తిస్తున్నాడని అన్నారు. పైకి మంచి వాడిలా నటిస్తూ లోపల ఆ సినిమాలోని విలన్ లాంటి క్యారెక్టరే అని విమర్శించారు.


జీవా హీరోగా నటించిన రంగం సినిమాలో విలన్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. హీరోకు ఫ్రెండ్ లా ఉంటూ.. పైకి మంచి వాడిలా నటిస్తూ.. సీఎం అవుతాడు. ముఖ్యమంత్రి అయ్యాక తెలుస్తుంది.. అతనిలోని విలన్ క్యారెక్టర్. నక్సలైట్లతో చేతులు కలిపి.. వారికే ద్రోహం చేసి.. తాను శాశ్వతంగా అధికారంలో ఉండాలని ప్రయత్నిస్తాడు. అలాంటి రంగం సినిమా విలన్ తో.. పవన్ కల్యాణ్ ను పోల్చడంపై జనసైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు. బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి స్థాయి తెలుసుకుని మాట్లాడాలంటూ.. పవన్ పై విమర్శలు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. జగన్ కు ఎన్ని ప్రైవేట్ సైన్యాలు ఉన్నా.. పవన్ కల్యాణ్ వెంట జనసైన్యం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×