BigTV English

Capital Amaravati: అమరావతికి దిష్టి తీయాలట.. మరీ ఇన్ని రికార్డ్స్ ఎలా?

Capital Amaravati: అమరావతికి దిష్టి తీయాలట.. మరీ ఇన్ని రికార్డ్స్ ఎలా?

Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఏమో కానీ, నిర్మాణం కాకమునుపే బిగ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎన్నో రికార్డ్స్ సాధించింది. అంతేకాదు దేశంలో ఏ రాజధానికి లేని గొప్ప ఘనత అమరావతికే దక్కింది. ఎక్కడైనా నిర్మాణం పూర్తి చేసుకుంటే రికార్డ్స్ రావడం కామన్. కానీ అమరావతి విషయంలో మాత్రం తెలుగోడి దెబ్బ అదుర్స్ కదూ అనవచ్చు. ఇంతకు అమరావతి సాధించిన ఆ రికార్డ్స్ ఏమిటో తెలుసుకుందాం.


అమరావతి అరుదైన రికార్డ్..
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి 2014 లో పునాది పడింది. అప్పుడు రైతులు అందించిన సహకారమే ఫస్ట్ రికార్డ్ బద్దలు కొట్టింది. రాజధాని నిర్మాణం కొరకు రైతులు అందించిన భూములు ఇప్పటికీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి. 2014లో రాజధానిని ప్రకటించిన వెంటనే, పలు గ్రామాల రైతులు తమ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి అప్పగించారు.

సుమారు 33,000 ఎకరాల భూములు అప్పగించగా, దాదాపు 29,000 మంది రైతులు తమ భూములు అందించి ప్రభుత్వానికి ప్రోత్సాహం అందించారు. 29 గ్రామాల రైతులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కాగా తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ మండలాలు కీలకంగా వ్యవహరించాయి.


ప్రస్తుత రికార్డ్స్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మళ్లీ నిర్మాణ దశలోకి ప్రవేశించడంతో ప్రధాన ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ భవనాలు డిజైన్, పరిమాణం, నూతన పరంగా రికార్డుల స్థాయిలో ఉండబోతున్నాయి. ఆ అద్భుతాలు తెలుసుకుంటే, ప్రతిరోజూ అమరావతి రాజధాని వీక్షణకు వెళ్ళివస్తారు.

అసెంబ్లీ భవనం..
ప్రపంచ ప్రఖ్యాత పోస్టర్, పార్ట్నర్స్ సంస్థ రూపొందించిన డిజైన్ ఆధారంగా అసెంబ్లీ భవనంను 11.22 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయి పార్లమెంట్ భవనాల సరసన నిలిచేలా రూపుదిద్దుకుంటోంది. ఈ భవనం ఎక్కారంటే చాలు, చుట్టూ 360 డిగ్రీలలో అమరావతి నగరాన్ని చూడవచ్చు. అందుకే ఇదొక అద్భుతమేనని చెప్పవచ్చు.

హైకోర్టు..
ఫోస్టర్ పార్ట్నర్స్ సంస్థ రూపొందించిన మరో అద్భుత డిజైన్ ఇది. అత్యాధునిక న్యాయవిధానాలకు అనుగుణంగా, టెక్నాలజీ ప్రాతినిధ్యంతో కూడిన న్యాయ భవనంగా ఈ భవనం చరిత్రకెక్కుతోంది. దీని నిర్మాణంలో పారదర్శకత, ప్రజలకు అందుబాటు ముఖ్య ధ్యేయాలు కాగా నిర్మాణం పూర్తయితే చాలు హైకోర్టు భవనాన్ని చూసి అదరహో అనాల్సిందే.

సచివాలయం..
ఏ రాష్ట్రానికైనా పరిపాలనకు కేంద్రం సచివాలయం. అటువంటి సచివాలయ భవనం ఇక్కడ ఎంతో ఆకర్షణగా నిర్మించనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రామాణికాలతో, అధికారుల వర్క్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా పనులు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల సచివాలయాలను తలదన్నేలా ఏపీ సచివాలయం రూపుదిద్దుకుంటుందని చెప్పవచ్చు.

ప్రభుత్వ కాంప్లెక్స్ – టవర్స్ రూపంలో..
అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా ఐదు ప్రధాన టవర్లు ఉండబోతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 49,040 కోట్లను కేటాయించగా, ప్రపంచ బ్యాంకు, ఏడిబి వంటి సంస్థల మద్దతుతో వీటి నిర్మాణం జరగనుంది. ఈ టవర్స్ రాజధానికి కొత్త హంగు తెస్తాయని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

డ్రోన్ సమ్మిట్ రికార్డ్..
2024 అక్టోబరులో అమరావతిలో జరిగిన డ్రోన్ సమ్మిట్‌లో 5,500 పైగా డ్రోన్ల ప్రదర్శన ద్వారా ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. ఇది అమరావతికి ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఘట్టంగా నిలిచింది. దీనితో అమరావతికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ప్రస్తుతం ఐదు ప్రధాన భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం, 2027 కల్లా తొలి దశ పూర్తవుతుంది. అందుబాటులోకి వచ్చిన నిధులు, పునఃప్రారంభమైన శంకుస్థాపనతో అమరావతికి కొత్త రూపు వస్తుందని చెప్పవచ్చు.

Also Read: AP News : బెజవాడ కోడలిగా పాకిస్తాన్ యువతి.. నెక్ట్స్ ఏంటి?

అంతేకాదు అమరావతి రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లు కూడా యావత్ ప్రపంచం అమరావతి వైపు చూసేలా నిర్మాణం సాగనుంది. మొత్తం మీద దేశంలోని ఏ రాష్ట్ర రాజధానికి లేని ఘనత అమరావతికి దక్కిందని చెప్పవచ్చు. ప్రధాని మోడీ చేతుల మీదుగా పునః నిర్మాణం పనులు శంఖుస్థాపన పూర్తి చేసుకోగానే, ప్రభుత్వం నిర్మాణ పనులను మరింత స్పీడ్ చేయనుంది. మరెందుకు ఆలస్యం.. అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా సాగి, ఏపీకి కొత్త కళ తీసుకురావాలని ఆశిద్దాం.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×