BigTV English

Allu Arjun : టీ షర్ట్ గమనించారా, పుష్ప రాజు కూడా నెల్లూరు పెద్దారెడ్డి పేరు చెప్పుకుంటున్నాడు

Allu Arjun : టీ షర్ట్ గమనించారా, పుష్ప రాజు కూడా నెల్లూరు పెద్దారెడ్డి పేరు చెప్పుకుంటున్నాడు

Allu Arjun : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హాస్యబ్రహ్మ అంటే టక్కున గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. బ్రహ్మానందం చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఒకానొక సందర్భంలో కేవలం బ్రహ్మానందం ఫోటో చూసి థియేటర్కు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు. చాలామందికి శ్రీను వైట్ల సినిమాలోని బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అంటే విపరీతంగా ఇష్టపడతారు. ఇప్పటికీ ఎన్నో ఐకానిక్ సీన్లు బ్రహ్మానందం కెరియర్ లో ఉన్నాయి. చాలామంది మాట్లాడుకోవడం మానేసి బ్రహ్మానందం స్టిక్కర్లను నేడు వాట్సాప్ లలో రిప్లై గా పంపుతూ ఉంటారు. ఆ స్టిక్కర్ చూడగానే ఇన్స్టంట్ గా అందరికీ నవ్వొస్తుంది. అంత ఇంపాక్ట్ బ్రహ్మానందం తన నటనతో ప్రేక్షకులపై కలిగించారు. ఎన్ని క్యారెక్టర్ చేసినా కూడా నెల్లూరు పెద్దరెడ్డి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అలా కారు డోర్ తీసి ఎవరిని ఆపుతున్నావో తెలుసా, అని ఒక స్వాగ్ లో చెప్పే డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


పుష్పరాజు కూడా అతని పేరు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన సినిమా పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. పుష్పరాజ్ ఇంపాక్ట్ ప్రపంచ వ్యాప్తంగా తెలిసి వచ్చింది. చాలామందికి నెల్లూరు పెద్దారెడ్డి తెలియకపోయినా పుష్పరాజు మాత్రం తెలుసు అని చెప్పాలి. ఇక పుష్పరాజుకి నెల్లూరు పెద్దారెడ్డికి లింక్ ఏంటి అని అంటే. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో పెంచుతూ వస్తున్న లాంగ్ హెయిర్ కూడా కట్ చేసి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు ఐకాన్ స్టార్. రీసెంట్గా ఐకాన్ స్టార్ తన కారు దిగి ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ వేసుకున్న టీ షర్ట్ చాలా మందిని ఆకర్షిస్తుంది. ఆ టీ షర్ట్ పైన బ్రహ్మానందం ఫొటోస్ తో పాటు కిందన నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని కొటేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అట్లీ దర్శకత్వంలో

ఇకపోతే అల్లు అర్జున్ అట్లే దర్శకత్వంలో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే . ఇది అట్లీ చేస్తున్న 6వ సినిమా, అల్లు అర్జున్ కెరీర్ కి ఇది 22వ సినిమా. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి దాదాపు 800 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు పెడుతున్నారు. దీంట్లో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 175 కోట్లు, అలానే ఈ సినిమాకి సంబంధించి అట్లీ 125 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. జవాన్ సినిమా తర్వాత అట్లీ రేంజ్ కూడా విపరీతంగా మారిపోయింది. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మీద అంచనాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశం ఉంది.

Also Read : Biggboss Syed Sohel : మా అమ్మను దూషించారు, అది చేసింది రియల్ ముస్లింస్ కాదు

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×