Case Filed on Chandu: అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరిం చారు వైసీపీ నేతలు. తమ నోటి పని కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దూకుడుతో బెంబేలెత్తుతున్నారు. నియోజకవర్గాల నేతల మధ్య మాటల యుద్ధాన్ని కాసేపు పక్కనబెడదాం. పార్టీ అధినేత చంద్రబాబును తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారు. ఇప్పుడు ఆయా నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.
లేటెస్ట్‌గా రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి భారీ షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన సోదరుడు చందుపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు.
వైసీపీ హయాంలో అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో సంచలన కామెంట్స్ చేశారు అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు. అప్పట్లో మొద్దు శ్రీనుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్క మాట చెప్పి ఉండుంటే.. చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని చంపేవాడని వ్యాఖ్యానించాడు.
తోపుదుర్తి చందు వ్యాఖ్యలపై ఆనాడు టీడీపీ నేతలు భగ్గుమన్నారు. రాప్తాడు పోలీసులను కలిసి కార్యకర్తలు ఫిర్యాదు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తోపుదుర్తి చందుపై అనంతపురం ఎస్పీకి టీడీపీ బీసీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు చందుపై కేసు నమోదు చేశారు.
ALSO READ: పవన్ కల్యాణ్ సెక్యూరిటీ.. కేడర్‌ని వెంటాడుతున్న భయం
ఒకవిధంగా చెప్పాలంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి ఊహించని షాక్. పేరుకే అప్పట్లో ఎమ్మెల్యేగా ఆయన వ్యవహారించారు. వెనుకుండి అంతా ఆయన సోదరుడు చందు నడిపించాడు. ఈ క్రమంలో తోపుదుర్తి గెలుపు సునాయాశమైంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి గాలికి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. రానున్న ఐదేళ్లు తమకు కష్టాలు తప్పవంటూ కార్యకర్తలతో ఆయన చెప్పిన విషయం తెల్సిందే.