BigTV English

Renudesai: అందుకే నాకు మనుషులంటే నచ్చరు.. చిత్రహింసలపై రేణూ షాకింగ్ కామెంట్స్..!

Renudesai: అందుకే నాకు మనుషులంటే నచ్చరు.. చిత్రహింసలపై రేణూ షాకింగ్ కామెంట్స్..!

Renudesai: రేణూ దేశాయ్ (Renudesai).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి పేరు దక్కించుకున్న రేణూ దేశాయ్.. పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో ప్రేమలో పడి, సహజీవనం చేసి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో భారీగా వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈమె, కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ముంబైలో జీవితాన్ని గడిపేస్తున్న రేణూ దేశాయ్ జంతు ప్రేమికురాలు కూడా. తన కూతురు ఆధ్య పేరు పైన జంతు సంరక్షణ కొరకు ఒక సంస్థ స్థాపించిన ఈమె, అక్కడ మూగజీవాలకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ మూగజీవాలను పోషించే క్రమంలో డబ్బు అవసరమైతే అభిమానుల నుంచి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరీ అడుగుతూ ఉంటుంది.


పిల్లిని చిత్రహింసలు పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రేణూ..

అంతే కాదు మూగజీవులపై ఎవరైనా విచక్షణారహితంగా ప్రవర్తిస్తే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ సోషల్ మీడియాలో తెగ ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక ఎప్పట్లాగే ఈసారి కూడా ఈమె షేర్ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. జంతువుల పై ఉన్న ప్రేమను మరొకసారి కనబరుచుతూ ఈ పోస్టును షేర్ చేసింది. ఇందులో రేణూ దేశాయ్ ‘ఫెలిసెట్’ అనే పిల్లి గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా జంతువులపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపించడమే కాకుండా మనుషులు జంతువుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసే ఈమె…ఈ క్రమంలోని ఈసారి ఫెలిసెట్ పిల్లిని అంతరిక్షంలోకి పంపించడం కోసం.. శాస్త్రవేత్తలు చేసిన చిత్రవదల గురించి చెబుతూ ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది.


అందుకే మనుషులు నచ్చరు అంటూ కామెంట్..

“ఫెలిసేట్ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపించడానికి ఎంతో ఇబ్బంది పెట్టారు. దాదాపు ఎన్నో వారాలపాటు ఆ పిల్లిని ఇక్కడే చిత్రహింసలకు గురిచేసి, దానిని రెడీ చేశారు. ఒక గట్టి కంటైనర్ లో ఆ పిల్లిని కూర్చోబెట్టి, కదలకుండా బంధించారు. అంతేకాదు ఆ పిల్లి శరీరంలో ఎలక్ట్రోడ్ లను కూడా ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ తట్టుకొని ఆ పిల్లి అంతరిక్షంలో రెండు నెలల పాటు శాస్త్రవేత్తల ప్రయోగానికి ఉపయోగపడాల్సి ఉంటుంది. ఒక పిల్లిని ఇంతగా చిత్రహింసలకు గురి చేయడం దారుణం.. అందుకే నాకు మనుషులంటే నచ్చదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రేణూ దేశాయ్. అంతేకాదు తన ఇన్స్టా స్టోరీలో ఆ పిల్లి ఫోటోని కూడా బ్యాక్ గ్రౌండ్ లో షేర్ చేసింది. మొత్తానికైతే జంతు ప్రేమికులు ఆమె పోస్టుకు పెద్ద ఎత్తున స్పందిస్తున్నా.. ఇంకొంతమంది మాత్రం టెక్నాలజీ అభివృద్ధి చెందేటప్పుడు ఇవన్నీ సహజం, అన్నింటిని తట్టుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు రేణూ దేశాయ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించడానికి ఇప్పటికి కూడా సిద్ధం అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×