Ambati Rambabu: ప్రజల్లోకి వెళ్లేటప్పుడు నేతలు కాస్త హుందాగా ఉండాలి. తమకు ఎదురులేదని రెచ్చిపోతే ఇబ్బందులు తప్పవు. అధికారంలో లేకుంటే ఆయా పార్టీల నేతలకు కష్టాలు తప్పవు. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలో అదే జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు.
రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనల్ని చూసి చాలామంది ఫాలో అవుతారు. ఈ నేపథ్యంలో నేతలు వేసే అడుగు, మాట్లాడే ప్రతీ మాట హుందాగా ఉండాలి. మాకు ఎదురులేదని రెచ్చిపోతే కష్టాలు తప్పవు. మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలో అదే జరిగింది.
వైసీపీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం పేరిట రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. అయితే పోలీసులతో కాస్త దురుసుగా ప్రవర్తించారు అంబటి రాంబాబు. తీవ్రమైన పదజాలంతో అడ్డుకున్న పోలీసులను విమర్శించారు. అంబటి ప్రవర్తనపై పోలీస్ అధికారి ఘాటుగా స్పందించారు. ఒకరినొకరు నిందించుకుంటూ వేలు చూపిస్తూ ఘర్షణకు దిగే ప్రయత్నం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్కొంటూ గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుతోపాటు కొందరి వైసీపీ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
ALSO READ: తప్పు చేస్తేనే శిక్ష.. ఏపీ కేబినెట్‌లో అరెస్టులపై చర్చ
పోలీసులు కేసు నమోదు చేసిన విషయంలో తెలియగానే ఆగ్రహంతో రగిలిపోయారు మాజీ మంత్రి అంబటి. ఈ సందర్భంగా మనసులోని భావాలను ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ‘కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునే వారు నామీద కేసులు పెట్టకుండా ఉంటారా అంటూ ప్రశ్నించారు. కేసులను నేను భయపడాలా?’ ప్రశ్నిస్తూ రాసుకొచ్చారు.
ఇంతకూ కాపుల మీదే కేసులేంటి అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. రీసెంట్‌గా తుని రైలు దహనం కేసుపై హైకోర్టులో అప్పీల్ చేసేలా ఆదేశాలు ఏపీ హోంశాఖ ఓ జీవో జారీ చేసింది. ఈ వ్యవహారంపై రోజంతా సాగింది. చివరకు ఆ జీవో ఉపసంహరించుకున్నట్లు హోంశాఖ తెలిపింది. దీనిపై బుధవారం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు కొందరు అధికారులతో మాట్లాడారు.
ఇలాంటి వాటిపై జీవోలు జారీ చేసేముందు పలుమార్లు ఆలోచించుకోవాలన్నారు. సంబంధిత మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇలాంటివి మరల పునరావృతం కాకూడదన్నారు. జరిగిన పొరపాటుకు హోంశాఖ కార్యదర్శి క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో మంత్రులకు ఏ విషయంలోనైనా సందేహాలు ఉంటే సీఎంవోను సంప్రదించాలన్నారు. ఈ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి.
కాపుల మీదే
కేసులు తిరగతోడాలనుకునే వారు
నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా?
కేసులకు నేను భయపడాలా ?@ncbn @naralokesh— Ambati Rambabu (@AmbatiRambabu) June 5, 2025