BigTV English

YS Viveka Murder Case: మూసుకుపోయిన దారులు.. అవినాష్‌కి మరో పది రోజులేనా..?

YS Viveka Murder Case: మూసుకుపోయిన దారులు.. అవినాష్‌కి మరో పది రోజులేనా..?
CBI request highcourt to cancel Avinashreddy bail on ys viveka murder case
CBI request high court to cancel Avinashreddy bail on ys viveka murder case

CBI Request High Court to Cancel Avinash Reddy Bail on YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యూ ట్విస్ట్. ఈ కేసులో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కష్టాలు తప్పవా? దాదాపుగా ఆయన ఇరుకున్నట్టేనా? ఇన్నాళ్లు అరెస్టు నుంచి తప్పించు కున్న ఆయన.. ఇక జైలుకి వెళ్లడం ఖాయమేనా? అవుననే సంకేతాలు బలంగా వినివిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరడం జరిగిపోయింది. మరో పది రోజుల్లో ఈ కేసు ఫైనల్ స్టేజ్‌కి రావచ్చని చెబుతున్నారు.


అసలు తెలంగాణ హైకోర్టులో ఏం జరిగింది? నిందితుడు అవినాష్‌రెడ్డి చుట్టూ ఎందుకు ఉచ్చు బిగుసు కుంటోంది? ఈ కేసులో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో నిందితుడు దస్తగిరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు అవినాష్‌రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించారన్నది ప్రధానంగా ప్రస్తావించారు.

దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుని సీబీఐ నిర్ణయమేంటని ప్రశ్నించారు. దస్తగిరి వాదనను సమర్ధిస్తున్నామని తెలిపింది సీబీఐ. అవినాష్ బెయిల్ రద్దు చేయాలని మీరెందుకు న్యాయస్థానాన్ని కోరలేదని ప్రశ్నించింది. అనుమతులు రావడానికి కొంత సమయం పడుతుందని, వివేకానంద కూతురు ఎస్ఎల్పీ దాఖలు చేశారని, అందులోనే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని తాము కౌంటర్ దాఖలు చేశామని గుర్తు చేశారు సీబీఐ న్యాయవాది.


దస్తగిరి అప్రూవల్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌తో దీనికి సంబంధం లేదని కోర్టు తెలిపింది. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈనెల 15కి వాయిదా వేశారు. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై విచారణను ఈనెల ఎనిమిదికి వాయిదా వేసింది.

Also Read: వైసీపీకి షాక్.. ఆమంచి రాజీనామా..

కేసు ఇంకా లోతుల్లోకి వెళ్తే.. అవినాష్ రెడ్డి అనుచరులు దస్తగిరి తండ్రిపై దాడి చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పుకుంటే దస్తగిరి ఫ్యామిలీకి ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నారా లేరా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి అవినాష్ తరపు లాయర్ లేదని రిప్లై ఇచ్చారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తామని నిందితులు శివశంకర్‌రెడ్డి, ఆయన కొడుకు చైతన్యరెడ్డి కలిసి దస్తగిరి ఆఫర్ ఇచ్చారని అడ్వకేట్ వాదించారు. అంతేకాదు దస్తగిరి కుటుంబానికి ఉద్యోగంతోపాటు ఫ్యామిలీ సమస్యలను చూసుకుంటామని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని గుర్తుచేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసులో ఈనెల 15కి వాయిదా వేశారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×