BigTV English

Citadel – Honey Bunny Web Series Review: ‘సిటాడెల్.. హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రివ్యూ

Citadel – Honey Bunny Web Series Review: ‘సిటాడెల్.. హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ : సిటాడెల్ – హనీ బన్నీ
నటీనటులు : వరుణ్ ధావన్, సమంతా, కెకె మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీమ్, సిమ్రాన్, కష్వీ మజుందార్, సోహమ్ మజుందార్ మరియు శివన్‌కిత్ సింగ్ పరిహార్.
దర్శకుడు : రాజ్ అండ్ డీకే
ఓటిటి : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్ : 6
రన్ టైం : 42 – 55 మినిట్స్ (ప్రతి ఎపిసోడ్)


Citadel : Honey Bunny Web Series Review and Rating – 1.5/5

Citadel : Honey Bunny Web Series Review : చాలా గ్యాప్ తరువాత సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ తో అలరించడానికి సిద్ధమైంది. డివోర్స్, వరుస డిజాస్టర్స్, వరుస వివాదాలు, మయోసైటీస్ అంటూ ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా ఉన్న సమంతా సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికంటే ముందే ఈ సిరీస్ కు సైన్ చేసి, పూర్తి చేసింది. మొత్తానికి తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ఈ సిరీస్ కు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా, బీ టౌన్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. కొన్నాళ్ళ క్రితం ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ అనే అమెరికన్ వెబ్ సిరీస్ కు ఇది ప్రీక్వెల్. ఆ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ ఇండియన్ వెర్షన్ ఎంత వరకు ప్రేక్షకులను అలరిస్తోంది అనే విషయాలను రివ్యూలో చూద్దాం.


కథ : 
వరుణ్ ధావన్ హీరోకి బాడీ డబుల్ గా మారి సినిమాల్లో స్టంట్స్ చేస్తుంటాడు. అక్కడ అతను కష్టపడుతున్న నటి సమంతను కలుస్తాడు. తరువాత వీరిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇద్దరూ ఇలా రొమాన్స్ లో మునిగి తేలుతున్న టైమ్ లోనే వరుణ్ ఆమెకు ఒక చిన్న పనిని అప్పజెప్తాడు. ఒక వ్యక్తిని 20 నిమిషాల పాటు మాటల్లో నిమగ్నమయ్యేలా చేయడమే సమంత. ఈ పని చేస్తున్న సమయంలో సమంత వేరే ఉచ్చులో చిక్కుకుంటుంది. దీంతో వరుణ్ గురించి ఆమెకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆపై రెండు ఏజెన్సీల మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే సామ్, వరుణ్ విడిపోతారు. అయితే చాలాకాలం తరువాత వరుణ్ తనకు కూతురు పుట్టిందని తెలుసుకుంటాడు. ఆమె ప్రమాదంలో ఉందనే విషయం తెలిసి కాపాడడానికి ట్రై చేస్తాడు. మరి ఎవరి నుంచి ఆ పాపకు ప్రమాదం ఉంటుంది? వరుణ్, సామ్ చివరకు ఒక్కటయ్యారా? వీరిద్దరూ అసలు ఎందుకు విడిపోయారు ? అసలు సామ్, వరుణ్ ఎవరు, ఎక్కడ పని చేస్తున్నారు? ఆ పాప ఎవరు ? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్ వేయాల్సిందే.

విశ్లేషణ :
రాజ్ అండ్ డికె దర్శకత్వం బాగుంది. వారు సీతా ఆర్ మీనన్‌తో కలిసి ఈ సిరీస్‌ను రాశారు. రాజ్ అండ్ డికె ప్రిపరేషన్ లేకుండా ఏమీ చేయరని ఈ సిరీస్ తో మరోసారి చూపించారు. సిరీస్‌పై ఈ దర్శకద్వయం పట్టు, నటీనటుల ఎంపిక అద్భుతం. ప్రియాంక చోప్రా ‘సిటాడెల్‌’కి ‘సిటాడెల్ హనీ బన్నీ’ ప్రీక్వెల్. ఇందులో ప్రియాంక పాత్ర నదియా బాల్యాన్ని చూపించారు. కథ 1992 నుంచి 2000 మధ్య కాలంలో బన్నీ, హనీ చుట్టూ తిరుగుతుంది. ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనేది డ్రామా, యాక్షన్‌తో కూడిన ఆరు-ఎపిసోడ్ల సిరీస్. ఇందులో కేవలం స్పై సినిమాలలో ఉండే సస్పెన్స్ మాత్రమే కాదు ఎమోషన్, డ్రామా, యాక్షన్ సరదాగా ఉంటుంది. ఊహించని ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. అయితే కమర్షియల్ సినిమాల్లో లాగా ఇందులో హీరో ఎంట్రీ గ్రాండ్ గా డిజైన్ చేయలేదు డైరెక్టర్స్.

హీరో పాత్రను వారు డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులు అతనికి ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. రాజ్ అండ్ డికె చిన్న అమ్మాయి పాత్రతో కలిగించిన భావోద్వేగం మనసును మెలి తిప్పడం ఖాయం. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. ఈ సిరీస్‌లో ఉన్న 6 ఎపిసోడ్‌లలో.. ప్రతి ఎపిసోడ్ 40 నుండి 50 నిమిషాల వరకు ఉంటుంది. మొదటి మూడు ఎపిసోడ్‌లు దాదాపు 45 నిమిషాల వ్యవధితో నెమ్మదిగా సాగి చికాకు పెడతాయి. అయితే కథ ఎక్కడికి వెళుతుందో అర్థం చేసుకున్న తర్వాత ఆ సాగదీత కొంతమందికి ఓకే అన్పించవచ్చు. కానీ మొత్తంగా చూస్తే సిరీస్ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేకపోయింది. రాజ్ అండ్ డీకే నుంచి ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో లేదు ఈ సిరీస్ అన్పించడం ఖాయం. ‘సిటాడెల్’ ప్రపంచం కొన్ని ట్విస్ట్ లు, ట్రీట్ లతో ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ ఓపిక చాలా అవసరం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సిరీస్ ను అనవసరంగా ఇంత టైమ్ తో ఇన్ని ఎపిసోడ్ లు సాగదీశారు అనే ఫీలింగ్ వస్తుంది. ఏ వర్గం వారికి నచ్చుతుందేమో కానీ అందరికీ నచ్చే, అన్నీ వర్గాల ప్రేక్షకులు మెచ్చే సిరీస్ అయితే కాదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, మిగతా టెక్నీషియన్ల పనితీరు బాగుంది.

నటీనటులు
వరుణ్ ధావన్ నటన అద్భుతంగా ఉంది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో పర్ఫెక్ట్ గా నటించాడు. కెకె మీనన్‌తో అతని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక సామ్ విషయానికొస్తే ఇంత గొప్ప స్థాయి ఉన్న హీరోయిన్‌గా సమంతను ఎందుకు పరిగణిస్తున్నారో ఈ సిరీస్ చెబుతుంది. ఆమె యాక్షన్ సన్నివేశాలు హీరోలకు మించి అన్నట్టుగా ఉంటాయి. ఇక తన కూతురితో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. కెకె మీనన్ అద్భుతమైన నటుడు, అతని పేరు ఎక్కడ వచ్చినా మంచి కంటెంట్ గ్యారెంటీ. ఇక్కడ కూడా బాబా పాత్రకు ప్రాణం పోశాడు. నదియా పాత్రలో బాలనటి కష్వీ మజ్ముందర్ స్పెషల్ అట్రాక్షన్. ఈ అమ్మాయి భావోద్వేగానికి గురి చేస్తుంది, తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది. సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, సిమ్రాన్ బగ్గా.. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పర్ఫెక్ట్ అన్పించారు.

మొత్తంగా..
‘సిటాడెల్ : హనీ బన్నీ’ సిరీస్ లో ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రలలో నటించిన మునుపటి ‘సిటాడెల్’ కంటే ఇదే బెటర్.

Citadel : Honey Bunny Web Series Review and Rating – 1.5/5

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×