AP Cabinet: ఏపీ కేబినెట్ కొద్దిసేపట్లో సమావేశం కానుంది. ఈ భేటీ కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఉచిత బస్సు పథకం, కొత్త బార్ పాలసీతోపాటు కొన్ని అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పెండింగ్ విషయాలపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత పథకంపై చర్చించనున్నారు. రేపో మాపో ఏపీకి కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల వస్తున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా బస్సులు కేటాయించాలా? ఉన్నవాటినే కంటిన్యూ చేయాలా అనేదానిపై చర్చించనున్నారు.
ఈ భేటీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి పేరును అధికారికంగా పేరు ఖరారు చేయనుంది. ఆ తర్వాత ప్రకటన చెయనుంది. వచ్చే నెల ఒకటి నుంచి ఏపీలో కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటివరకు ఉన్నబార్ల పాలసీ గడువు ముగియనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే అధికారులు సీఎంకు వివరించారు.
ఏపీలో 840 బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్దతిలో బార్లకు అనుమతులు ఇవ్వనుంది. జనాభాను బట్టి బార్ షాపుల నుంచి లైసెన్స్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. 50వేల జనాభాలో ఉన్న ప్రాంతంలో ఫీజు రూ.35 లక్షలు పెట్టే అవకాశముంది. బార్ పాలసీలో కొత్తగా గీత కులాలకు 10 శాతం బార్లు దక్కనున్నాయి. బార్ లైసెన్స్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.700 కోట్లు ఆదాయం రావచ్చన్నది అధికారుల అంచనా.
ALSO READ: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు
దీనికితోడు ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కార్డుపై క్యూఆర్ కోడ్‌తో ఎక్కడి నుంచిైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్సించింది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదిక పై చర్చించుంది.
నాలా చట్ట సవరణకు సంబంధించి ఈ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. పంట భూమిని వ్యవసయేతర అవసరాల కోసం ఉపయోగించేందుకు నాలా చట్టానికి సవరణలపై చర్చించనుంది. అలాగే ఎల్ ఆర్ ఎస్, బీఆర్ఎస్ లపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు టీమ్ ఇటీవల సింగపూర్ టూర్‌పై కేబినెట్ లో చర్చించనున్నారు. ఏపీకి రాబోయే పెట్టుబడులు, వివిధ అంశాలపై చర్చకు రానున్నాయి. లిక్కర్ కుంభకోణంలో నగదు బయట పడడం, జరిగిన అరెస్ట్‌లు మంత్రులతో సీఎం చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తోటి మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.