Illu Illalu Pillalu ToIlluday Episode August 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ఒక్కటే నడుచుకుంటూ రావడం చూసి ధీరజ్ ఒకటే నడుచుకుంటూ వస్తుందే సైకిల్ మీద ఎలాగైనా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని అనుకుంటాడు.. నీ ప్రేమ మాత్రం ఈరోజు డ్రాప్ చేస్తానంటావు. రేపు నువ్వు నాకు ఇంట్లో వస్తువుతో సమానం అని అంటావు ఎందుకు వచ్చిందిలే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అంటుంది. సాగర్ నీ పరిస్థితి కూడా ఇంతేనా రా అని అంటాడు.. ధీరజ్ మాత్రం ప్రేమని నువ్వు అలా ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే నాకు బాధగా అనిపిస్తుంది రా డ్రాప్ చేస్తానని బతిమిలాడతాడు. దానికి ఒప్పుకున్న ప్రేమ నేను సైకిల్ మీద కూర్చుంటాను.. నువ్వు నన్ను ఎక్కించుకొని నడుచుకుంటూ తోసుకుంటూ రావాలి అని అంటుంది. సాగర్ నర్మద దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరిస్తాడు. కాని నర్మద మాత్రం సాగర్ ని చూసి కూడా చూడనట్టే ఉంటుంది.. సాగర్ బ్రతిమలాడుతూ ఉంటే నర్మదా అతని ఎవరో తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తుంది. కాసేపు సాగర్ కు చుక్కలు చూపిస్తుంది. ఇద్దరు కలిసి భాద పడతారు. శ్రీవల్లి వల్ల ఆనందరావు దొంగతనం చెయ్యాలని ప్లాన్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి భాగ్యం ఇంటికి వస్తుంది. కోపంగా లోపలికి వచ్చి అక్కడ ఉన్న వస్తువులని పగలగొడుతుంది. ఇప్పటికన్నా 10 లక్షలు ఇవ్వకపోతే నేను శాశ్వతంగా ఇక్కడే ఉండి పోవాల్సింది అని అంటుంది.. కానీ శ్రీవల్లి తాళాలను చూసిన ఆనందరావు నేను దొంగగా వస్తాను నువ్వు ఆ తాళాలు నాకు ఇచ్చేయ్ పది లక్షలు కొట్టేసి ఇచ్చేద్దామని అంటాడు. ఇది గనుక మా ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి అంతే అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది. ఇక రామరాజు కోసం వేదవతి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది.. రామరాజు శ్రీవల్లి కోసం ఎదురు చూస్తాడు. రామరాజుతో శ్రీవల్లి పిచ్చిదాని లాగా మాట్లాడుతూ ఉంటుంది..
రామరాజు మాత్రం మాట్లాడడానికి మాటలు ఏమున్నాయో అని అంటాడు.. మాట్లాడ్డానికి మాటలు ఏముంటాయి ఏం మాట్లాడుతున్నారండి అని బాధపడుతుంది వేదవతి. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరుగా మారతారుగా.. నమ్మకం కరువైతే మాటలు కూడా బరువు అయితే అని రామరాజు భేదవతిని బాధపడేలా చేస్తాడు. వేదవతి బాధపడడం చూసిన కోడలు ఇద్దరు ఎంత బాధపడుతుందో అని అనుకుంటారు.
శ్రీవల్లి వాళ్ళ నాన్న దొంగతనానికి వస్తున్నాడు. దొరకకుండా ఉండాలని దేవుళ్ళ అందరిని మొక్కుకుంటూ ఉంటుంది. అనుకున్నట్లుగానే ఆనంద్ రావు రామరాజు ఇంటికి దొంగతనానికి ఫుల్లుగా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వస్తాడు. నేను బాగా ప్రిపేర్ ఐయోచ్చాను. ఇక నన్ను ఎవరు ఆపలేరు ఆ పది లక్షలు కొట్టేస్తాను ఉదయం కల్లా డబ్బులని ఇచ్చేస్తాను అని అంటాడు.. ఒక శ్రీవల్లికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. ఫోన్ కోసం లేస్తుంటే చందు చెయ్యి వేయడంతో శ్రీవల్లి ఆగిపోతుంది. ఎలాగోలాగా ఫోన్ తీసుకొని బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతుంది.
అమ్మ నేను వచ్చేసాను నువ్వు తలుపు తీసి తాళాలు అక్కడ పెట్టి వెళ్ళు నేను పని పూర్తి చేసుకొని తొందరగా వెళ్తాను అని అంటాడు.. ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చినా శ్రీవల్లి చందు ని చూసి షాక్ అవుతుంది.. ఏంటి అర్ధరాత్రి పూట దెయ్యాల లాగా ఈ ఫోన్లో అని అడుగుతాడు.. లేదండి మాకు పొద్దున్నే మాట్లాడుకోవడానికి టైం లేదు కదా.. ఏదైనా పొద్దున్నే మాట్లాడుకోవచ్చు కదా రా వచ్చి పడుకో అని చందు అంటాడు.. ధీరజ్ అప్పుడే ఇంటికి వస్తాడు అక్కడ తలుపు వేసి ఉండడం చూసి ప్రేమ నాకోసం వెయిట్ చేస్తూ ఉండాలి కదా మరి ఈరోజు లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు.
ప్రేమకు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. దానికి ప్రేమ నేను స్మశానంలో వాకింగ్ కి వచ్చాను అని సరదాగా సెటైర్లు వేస్తుంది.. అదేంటి అలా అంటున్నావ్ అని ధీరజ్ అంటాడు.. అయితే నేను నీ దృష్టిలో ఒక వస్తువు నే కదరా అందుకే నేను లోపలే ఉన్నాను. నీకోసం వెయిట్ చేయలేదు అని అంటుంది ప్రేమ.. బాగా ఆకలేస్తుంది బయట దోమలు కుడుతున్నాయి వచ్చి తలుపు తీయ్యావా అని బ్రతిమలాడుతాడు.. అయితే ప్రేమకు ధీరజ్ మళ్లీ ఫోన్ చేస్తాడు. ఏదైనా కథ గాని లేదా జోకు గాని లేదా పాట దాని పాడి నన్ను ఇంప్రెస్ చెయ్యి అప్పుడే డోర్ తీస్తానని అంటుంది.
ధీరజ్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడంతో ఫోన్ పెట్టేస్తుంది ప్రేమ. ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న వచ్చేసి ఉంటాడని బయట వెయిట్ చేస్తుంటాడేమో అని చందు నిద్రపోగానే మెల్లగా బయటకు వచ్చి తలుపుతీస్తుంది. తలుపు తీయగానే బయట ధీరజ్ని చూసి షాక్ అవుతుంది. అయితే ధీరజ్ ఏంటి వదిన నువ్వు ఈ టైంలో డోర్ తీయవు కదా మరి ఏం చేస్తున్నావ్? ఎవరికోసం తీసావ్? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.. ఇది ఆశ్చర్యం కాదు ఆనందం కాదు.. మావయ్య గారు నాకు అప్పగించిన బాధ్యతని నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను. అంతేకానీ మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని అయిపోయాను. అందుకే కొన్ని మార్చేస్తున్నాను అని అంటుంది శ్రీవల్లి.
Also Read : అవనిని గేంటేసిన పార్వతి.. భరత్, ప్రణతిలను విడగొట్టేందుకు పల్లవి ప్లాన్.. భానుమతికి వాతలు..
ధీరజ్ శ్రీవల్లిని ఏదో టెన్షన్ పడుతున్నారు మీ ముఖం మొత్తం చమటలు పడుతున్నాయి అని అడుగుతాడు. నేనెందుకు టెన్షన్ పడతాను నాకేం అవసరం అని శ్రీవల్లి అంటుంది. నువ్వు లోపలికి వస్తావా లేక డోర్ వేసుకుని వెళ్లిపోమంటావా అని ధీరజ్ని శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు వచ్చి ప్రేమని పిలవడం నేను విన్నాను అందుకే డోర్ తీశాను. ఇక నీ ఇష్టం అని అంటుంది.. ఈరోజు వస్తాను లోపలికి అని అంటాడు. ఈరోజు లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్న వచ్చాడు లేదో కనుక్కుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…