BigTV English

Chandrababu Eye surgery : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు

Chandrababu Eye surgery : తెలుగుదేశం అధినేత, అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం కంటి ఆపరేషన్ జరిగింది. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కుడి కంటికి వైద్యులు కాటరాక్ట్ ఆపరేషన్‌ చేశారు.

Chandrababu Eye surgery : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు

Chandrababu Eye surgery : తెలుగుదేశం అధినేత, అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం కంటి ఆపరేషన్ జరిగింది. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కుడి కంటికి వైద్యులు కాటరాక్ట్ ఆపరేషన్‌ చేశారు. కేవలం 45 నిమిషాల్లో ఈ చికిత్స పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.


ఆయన వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ తర్వాత తనకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన వైద్యులతో కలిసి చంద్రబాబు ఫోటో దిగారు.

ఈ సందర్భంగా చంద్రబాబు త్వరగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేశారు.


మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కంటి ఆపరేషన్ నిమిత్తం ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను ఇటీవలే హైకోర్టు మంజూరు చేసింది.

అయితే జైలుకు వెళ్లినప్పటి నుంచి డీహైడ్రేషన్, చర్మ సంబంధిత వ్యాధులు, బరువు తగ్గడం, కంటి చూపుతో బాధపడుతుండటంతో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఏపీ హైకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. కంటి ఆపరేషన్ సంబంధించిన చికిత్స, విశ్రాంతి పూర్తయ్యాక చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు మళ్లీ వెళ్లాల్సి ఉంది.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×