Chandrababu comments on Jagan(Andhra pradesh election news): రాష్ట్రంలో సీఎం జగన్ నాసిరకం మద్యాన్ని పెట్టి ఎంతో మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. డ్రైవింగ్ రాని వ్యక్తి చేతిలో రాష్ట్రం.. రివర్స్ గేర్ లో వెళ్లిందని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో జగన్ ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి అతలాకుతలం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. టీచర్లను మద్యం దుకాణాలు వద్ద కాపలా పెట్టిన ప్రభుత్వం వైసీపీది అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. స్కూళ్లకు రంగులేసినంత మాత్రాన పిల్లలకు చదువు వస్తుందా అంటూ ప్రశ్నించారు.
టీచర్లను మద్యం దుకాణాలు వద్ద కాపలా పెట్టిన ప్రభుత్వం వైసీపీది అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే జగన్ స్వభావమని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం అప్పులు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారంటూ ఫైరయ్యారు. ఆదాయం తగ్గి.. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.
ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా అంటూ చంద్రబాబు జగన్ ను ప్రశ్నించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చి జగన్.. బలవంతంగా ప్రజలు ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులు, భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం చేస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు.