BigTV English

KCR: ఈసీ సంచలన నిర్ణయం.. కేసీఆర్ ప్రసంగంపై 48 గంటల నిషేధం

KCR: ఈసీ సంచలన నిర్ణయం.. కేసీఆర్ ప్రసంగంపై 48 గంటల నిషేధం

KCR: కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్‌ ఇచ్చింది. అభ్యంతరకర ప్రసంగాలు చేసినందుకు 48 గంల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్‌ అయ్యింది. దీంతో రెండు రోజులు పాటుగా కేసీఆర్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించకూడదంటూ నోటసులు జారీ చేసింది.


ఏప్రిల్ 5న సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో తాము చెప్పని మాటలను చెప్పినట్లుగా కేసీఆర్ మాట్లాడడంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ వివరణ కోరినా కేసీఆర్ రెస్పాండ్ కాలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ.. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించింది. కాగా, ఈ బ్యాన్ అనేది బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు అమలులోకి రానున్నట్లు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: రిజర్వేషన్ల రద్దే.. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం: సీఎం రేవంత్ రెడ్డి


ఈసీ తీసుకున్న నిర్ణయంపై కేసీఆర్ స్పందించారు. తాను స్థానిక మాండలికంలో మాట్లాడానని.. దాన్ని ఎన్నికల అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని వాటిని మాత్రమే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదన్నారు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్ని మాత్రమే ప్రస్థావించానని కేసీఆర్ వివరణ ఇచ్చారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×