Pushpa 2 First Song Review: ఇది సార్ నా బ్రాండ్ అంటూ పుష్ప క్లైమాక్స్ లో అల్లు అర్జున్.. తన చేతిని వీపు మీద కొట్టి మరీ చూపిస్తాడు. ఈ సీన్ ను తెలుగు ప్రేక్షకులే కాదు సినిమా లవర్స్ కూడా నాథ త్వరగా మర్చిపోలేరు. పెళ్లి బట్టల్లో చొక్కా లేకుండా వీపు మీద పుష్ప చేతి ముద్ర ఆ రేంజ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక అదే బ్రాండ్ తో సెకండ్ పార్ట్ తెరకెక్కిందని సుకుమార్ చెప్పకనే చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రూల్.. ఆగస్టు 15 న రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ మొత్తం ఊర మాస్ గా సాగింది. మొదటి ఫ్రేమ్ లోనే పుష్ప లాస్ట్ షాట్ పెళ్ళిలో కూర్చున్న బన్నీ బ్యాక్ సైడ్ చూపించారు. ఇక అక్కడ నుంచి పుష్ప ఎలా ఎదిగాడు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. లిరిక్స్ లో పుష్ప.. ఎవరికి తల వంచుతాడు.. ఎవరికి తల ఎత్తి నిలబడతాడు అనేది చెప్పుకొచ్చారు.
పుష్ప రాజ్ స్వాగ్, యాటిట్యూడ్ కు తగ్గ లిరిక్స్ ను చంద్రబోస్ అందించిన విధానం ఆకట్టుకుంటే.. ఆ సాంగ్ ను తమ బేస్ వాయిస్ తో మరింత పెంచేశారు సింగర్స్ నకాష్ అజీజ్, దీపక్ బ్లూ. సాంగ్ మొత్తం ఒక ఎత్తు అయితే.. పుష్ప కాస్ట్యూమ్స్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. తన బ్రాండ్ ఇది అని చేతి గుర్తును సైతం షర్ట్ మీద డిజైన్ చేయించుకొని వేసుకున్న తీరుకు, అసలు అలాంటి ఒక ఐడియాను ఆలోచించిన సుకుమార్ బుర్రకు దండం పెట్టాలి.
Also Read: Krishnamma Trailer: ఎందుకు చస్తున్నామో తెలియకపోవడమే అసలైన బాధ.. ఆసక్తి రేపుతున్న కృష్ణమ్మ ట్రైలర్
ఇక సుకుమార్ ఆలోచనలను కార్యరూపానికి తీసుకొచ్చినవారు కాస్ట్యూమ్ డిజైనర్లు. ప్రతి షర్ట్ డిజైన్ లో చేతి ముద్ర ఉండేలా చూసుకొని.. పుష్పరాజ్ అనే క్యారెక్టర్ కు డ్రెసింగ్ ఎంత ముఖ్యమో చూపించారు. వారే.. దీపాలి నూర్, శీతల్ శర్మ. సినిమా మొత్తం బన్నీ ఇవే కాస్ట్యూమ్స్ వాడినట్లు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే.. ఇలాంటి ఒక డిజైన్ చేసినందుకు వారికి దండం పెట్టాలి. ఈ సాంగ్ తరువాత మార్కెట్ లో పుష్ప షర్ట్స్ ఫేమస్ అవ్వడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి సినిమా తరువాత పుష్ప బ్రాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.