BigTV English

Chandrababu Naidu : బెజవాడలో భారీ బైక్‌ ర్యాలీ.. చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ..

Chandrababu Naidu : బెజవాడలో భారీ బైక్‌ ర్యాలీ.. చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ..
Chandrababu Naidu news today

Chandrababu Naidu news today(AP political news):

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వచ్చారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన ఆయన.. శ్రీవారి దర్శనం తర్వాత విజయవాడకు వచ్చారు. ఇక్కడ పార్టీ అధినేతకు తెలుగుదేశం శ్రేణులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అడుగడుగునా బాబుకు ఘనస్వాగతం లభించింది.


తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోగానే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, కొంతమంది సీనియర్‌ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి.

టీడీపీ ర్యాలీ సమయంలో గన్నవరం ఎయిర్ పోర్ట్, జాతీయ రహదారి పరిసరాల్లో పోలీసులు భారీగా మొహరించారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ టీడీపీ కార్యకర్తలను నిలువరించే పోలీసులు యత్నించారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా టీడీపీ కార్యకర్తలు ముందుకు కదిలారు.


టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యూత్ భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పూల వర్షంతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.

Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×