BigTV English

Planes Village : ఆ గ్రామంలో ఇంటికో విమానం..

Planes Village : ఆ గ్రామంలో ఇంటికో విమానం..
Planes Village

Planes Village : సొంత వాహనం అంటే సైకిలో, మోటారు సైకిలో ఉంటుంది. ఇంకాస్త పై స్థాయి అయితే కారు ఉండొచ్చు. కానీ ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఓ విమానం కచ్చితంగా ఉంటుంది. అంతే కాదండోయ్.. వాటిని పార్క్ చేసేందుకు హ్యాంగర్లూ ఉండటం విశేషం. షాపింగ్ లేదా ఆఫీసుకి వెళ్లి రావాలంటే ఎంచక్కా విమానంలో వెళ్లి వచ్చేస్తారు.


ఏకంగా ఊరు ఊరంతా విమానాలనే సొంత వాహనాలుగా కలిగి ఉన్నది ఎక్కడంటారా? అమెరికాలోని ఆ ఊరు పేరు కేమరూన్ పార్క్. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో సమీపంలో ఉంది ఇది. ప్లేన్ పార్కింగ్ కోసం అక్కడ ప్రతి ఇంటికీ తగిన స్థలం కూడా ఉంటుంది. అసలు విషయం చెప్పుకోవాల్సి వస్తే.. కేమరూన్ పార్క్‌లో నివసించేవారందరూ రిటైర్డ్ పైలట్లే.

ఆ ఊళ్లోకి అడుగుపెట్టగానే అదో ఎయిర్‌స్ట్రిప్ అనే భావన కలుగుతుంది. రోడ్డుకి అటూ, ఇటూ విమానాలే. ప్రతి ఇంటి ముందూ ఓ విమానం పార్కింగ్ చేసి ఉంటుంది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు వీలుగా అక్కడి రోడ్లను నిర్మించడం విశేషం. ఈ బుల్లి టౌన్‌షిప్‌ వెనుక బోలెడు చరిత్ర ఉంది.


1939లో అమెరికాకు 34 వేల మంది పైలట్లు ఉండగా.. 1946 నాటికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రభుత్వం బోలెడన్ని ఎయిర్ ఫీల్డ్స్‌ను నిర్మించింది. అనంతరం అవి నిరుపయోగంగా మారాయి. దీంతో ఎయిర్‌స్ట్రిప్స్‌తో ఉన్న ఆ ప్రాంతాలను రిటైర్డ్ సైనికులకు కేటాయించింది. అలా ఏర్పడిన రెసిడెన్షియల్ ఎయిర్ పార్క్‌లలో కేమరూన్ పార్క్ ఒకటి.

1963లో ఇది ఏర్పాటైంది. అక్కడ ప్రస్తుతం 124 ఇళ్లు ఉన్నాయి. సొంత వాహనంగా ఓ కారు ఉంటే ఎలా ఉంటుందో కేమరూన్ పార్క్‌లో ఉన్నవారందరికీ విమానాలు ఉన్నాయి. హ్యాంగర్లలోనే లేదంటే ఇంటి ముందో విమానాలను పార్క్ చేస్తుంటారు. విమానాల రాకపోకలకు అనువుగా రోడ్లు 100 అడుగుల మేర విశాలంగా ఉంటాయి.

సమీపంలోని ఎయిర్‌పోర్టుకు ఆ దారులన్నీ అనుసంధానించి ఉంటాయి. ఫ్లారిడాలోనూ ఇలాంటి ఎయిర్ పార్కే ఉంది. అక్కడి స్ప్రూజ్ క్రీక్‌లో 1300 వరకు ఇళ్లున్నాయి. ఇలాంటి రెసిడెన్షియల్ ఎయిర్ పార్క్‌లు ప్రపంచవ్యాప్తంగా 640 వరకు ఉన్నట్టు అంచనా.

Related News

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

Big Stories

×