BigTV English

Chandrababu at Anakapalli: జాబు రావాలంటే బాబు రావాలి.. బటన్ నొక్కడంపై చంద్రబాబు విమర్శలు!

Chandrababu: ఏపీలో త్వరలో జరిగే ఎన్నికలపై రాష్ట్ర భవిష్యత్‌ ఆధారపడి ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు తెలిపారు. 64 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Chandrababu at Anakapalli: జాబు రావాలంటే బాబు రావాలి.. బటన్ నొక్కడంపై చంద్రబాబు విమర్శలు!

Chandrababu Speech in ‘Raa Kadali Raa’ at Analakalli Sabha: ఏపీలో త్వరలో జరిగే ఎన్నికలపై రాష్ట్ర భవిష్యత్‌ ఆధారపడి ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు తెలిపారు. 64 రోజుల్లో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన ప్రశంగించారు. బటన్‌ నొక్కుతున్నానని సీఎం జగన్‌ గొప్పలు చెబుతున్నారన్నారు. ‘‘బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?’’ అని జగన్ ను ప్రశ్నించారు. జగన్ పుణ్యమంటూ రాష్ట్రంలో చెత్తపన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు.


జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం.. ప్రజలు గెలవాలని తెలిపారు. సైకో సీఎం జగన్ పరిపాలనను అంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇలాంటి సీఎంను తాను జీవితంలో చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆయనపై మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.64వేల కోట్ల రూపాయలు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ బటన్‌ నొక్కడం వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం రూ.8 లక్షలు నష్టపోయిందని ఆయన తెలిపారు.

జాబ్‌ క్యాలెండర్, సీపీఎస్‌ రద్దు, మద్య నిషేధం, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్‌ నొక్కలేదు? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. జగన్‌ది కేవలం ఉత్తుత్తి బటన్‌ మాత్రమేనని జగన్‌పై ఆయన మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాజధాని లేకుండా చేశారని సీఎం జగన్‌పై మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందే’’ నని చంద్రబాబు వెల్లడించారు.


Related News

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

MLA Madhavi Reddy: కుర్చీకోసం కలెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్.. చివరకు నిలబడే..

Big Stories

×