BigTV English

India Vs England 2nd Test Highlights: రవిచంద్రన్ అశ్విన్ కొత్త చరిత్ర.. ఆ రికార్డు బ్రేక్!

India Vs England 2nd Test Highlights: రవిచంద్రన్ అశ్విన్ కొత్త చరిత్ర.. ఆ రికార్డు బ్రేక్!

Ravichandran Ashwin Made New record Against England in 2nd Test: భారత్ టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ పై భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉండేది.


భగవత్ చంద్రశేఖర్ 23 టెస్టుల్లో ఇంగ్లాండ్ 95 వికెట్లు తీశాడు. అశ్విన్ ఆ రికార్డును 21 టెస్టుల్లోనే అధిగమించాడు. ఇంగ్లాండ్ తో తాజా టెస్ట్ సిరీస్ కు ముందు అశ్విన్ ఆ జట్టుపై 19 టెస్టుల్లో 88 వికెట్లు తీశాడు. హైదరాబాద్ లో జరిగిన తొలిటెస్టులో మొత్తం 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్ .. అనిల్ కుంబ్లేను అధిగమించాడు. అనిల్ కుంబ్లే 19 టెస్టుల్లో 92 వికెట్లు తీశాడు.

విశాఖలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. రెండో ఇన్నింగ్స్ లో తొలుత బెన్ డక్కెట్ అవుట్ చేసి చంద్రశేఖర్ రికార్డును సమయం చేశాడు. ఓలీ పోప్ వికెట్ తీసి ఆ రికార్డు బ్రేక్ చేశాడు.


ఓవరాల్ గా చూస్తే జేమ్స్ అండర్సన్ భారత్ పై 35 టెస్టుల్లో 139 వికెట్ తీసి టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానం ఇప్పుడు అశ్విన్ కే దక్కింది. బిషన్ సింగ్ బేడీ 22 టెస్టుల్లో 85 వికెట్లు, కపిల్ దేవ్ 27 టెస్టుల్లో 85 వికెట్లు తీశారు.

స్టువర్ట్ బ్రాడ్ 24 టెస్టుల్లో 74 వికెట్లు, ఇషాంత్ శర్మ 23 టెస్టుల్లో 67 వికెట్లు, బాబ్ విల్స్ 17 టెస్టుల్లో 62 వికెట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. డెరకె అండర్ వుడ్ 20 టెస్టుల్లో 62 వికెట్లు పడగొట్టాడు.

ఈ టెస్టు ముందు 96 టెస్టుల్లో 496 వికెట్లు పడగొట్టాడు అశ్విన్. ఈ మ్యాచ్ లో టెస్టులో 500 వికెట్ల మార్కు దాటుతాడని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకున్నా నెరవేరలేదు. ఆ రికార్డుకు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.

Tags

Related News

Rishabh Pant : గిల్ ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేసిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

Cricketers: ఇదెక్కడి స్టేడియం రా… మెట్లపైనే స్కోర్ బోర్డు వివరాలు.. ఎక్కడంటే

Arjun Tendulkar Engagement: అర్జున్ టెండూల్కర్ కు 500 కోట్ల కట్నం..?

Sara – Arjun: సారా, అర్జున్ వివాహం ఒకే రోజు జరగనుందా… సచిన్ ప్లాన్ అదుర్స్ ?

Jaiswal – Shreyas : ఆసియా కప్ 2025 కోసం టీమిండియా… శ్రేయాస్, జైశ్వాల్ కు నిరాశే !

Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే

Big Stories

×