BigTV English

Nara Lokesh: నారా లోకేష్‌‌కు జెడ్ కేటగిరీ భద్రత.. కేంద్రం ఆదేశాలు జారీ

Nara Lokesh: నారా లోకేష్‌‌కు జెడ్ కేటగిరీ భద్రత.. కేంద్రం ఆదేశాలు జారీ
nara lokesh
nara lokesh

Nara Lokesh:ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం వెలుగుచూసింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత పెంచింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్పీఎఫ్ బలగాలను లోకేష్ కు భద్రతగా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.


2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోకేష్ కు వైసీపీ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. అయితే అంతకుముందే 2016 సంవత్సరంలో జరిగిన ఏవోబీ ఎన్ కౌంటర్ తరువాత లోకేష్ కు భద్రత పెంచాలని కోరుతూ ఎస్ఆర్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో 2019లో లోకేష్ కు భద్రతను తగ్గించిన వైసీపీ ప్రభుత్వం.. సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ సిఫార్సులను పక్కన పెట్టింది. ఇప్పటి వరకు కేవలం వై క్యాటగిరి భద్రతను మాత్రమే కల్పిస్తూ వస్తుంది. ఈ తరుణంలో కేంద్రం జెడ్ క్యాటగిరి భద్రతను కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: రాజకీయాలకు మాజీ మంత్రి బండారు గుడ్ బై


వైసీపీ ప్రభుత్వానికి 14 సార్లు లేఖలు..

సెక్యూరిటీ రివ్యూ కమిటీ లోకేష్ కు ప్రాణ హాని ఉందని పలుమార్లు ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. ఈ తరుణంలోనే భద్రతను తగ్గించిన విషయంపై ప్రభుత్వాలకు లేఖలు రాశారు. లోకేష్ కు తగిన భద్రతను కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖలకు లోకేష్ భద్రతా సిబ్బంది 14 సార్లు లేఖను రాశారు. మరోవైపు భద్రత కల్పించడంతో ఏపీ ప్రభుత్వం తీరును కేంద్రం వరకు తీసుకెళ్లారు.

లోకేష్ ఇటీవల చేపట్టిన యువగళం పాదయాత్రలో వైసీపీ భౌతిక దాడులకు పాల్పడుతుందని భద్రత పెంచాలని కోరుతూ కేంద్ర హోం శాఖ, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టడంపై కేంద్రం సీరియస్ అయింది. ఈ తరుణంలోనే లోకేష్ కు భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×