BigTV English

Rappa Rappa: రప్పా రప్పా.. చంద్రబాబు రియాక్షన్ చూడండి..

Rappa Rappa: రప్పా రప్పా.. చంద్రబాబు రియాక్షన్ చూడండి..

ఏపీలో ఈరోజు పుష్ప సినిమా డైలాగ్ మారుమోగిపోతోంది. వాస్తవానికి ఈ మేనియా నిన్నటి నుంచీ మొదలైందనుకోండి. నిన్న సత్తెనపల్లి జగన్ టూర్ లో ఓ అభిమాని రప్పా రప్పా నరికేస్తామంటూ పుష్ప సినిమాలో డైలాగ్ ని కాస్త తనదైన స్టైల్ లో మార్పు చేసి ఓ ప్లకార్డ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈరోజు ప్రెస్ మీట్ లో జగన్ కి ఆ రప్పా రప్పా ప్రశ్న ఎదురైంది. ఇలాంటివి ప్రోత్సహించవచ్చా అని అన్నందుకు జగన్ అమాయకంగా ఓ లాజిక్ తీశారు. సినిమా డైలాగుల్ని కూడా ప్రదర్శించే హక్కు ఈ ఏపీలో ప్రజలకు లేదా అంటూ ప్రశ్నించారు. కూటమి పాలన నచ్చని ఓ టీడీపీ అభిమాని, చివరకు వైసీపీ అభిమానిగా మారి.. రప్పా రప్పా నరికేస్తాం అన్నాడు అంతే కదా, అంటూ లైట్ తీసుకున్నాడు. పదే పదే రప్పా రప్పా అంటూ తన మేనరిజంతో ఆ డైలాగ్ ని మరింత హైలైట్ చేశాడు.


బాబు రప్పా రప్పా..
ఆ తర్వాత మళ్లీ రప్పా రప్పా మొదలైంది. కాసేపటికే సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన దగ్గరకు కూడా ఈ ప్రశ్న వెళ్లింది. రప్పా రప్పా అంటూ నరికేస్తాం అంటున్నవారిని జగన్ సమర్థిస్తున్నారు, మీ రియాక్షన్ ఏంటని అడిగారు జర్నలిస్ట్ లు. దానికి చంద్రబాబు కాస్త ఘాటుగానే బదులిచ్చారు. సినిమా డైలాగులే కదా అని లైట్ తీసుకుంటున్న జగన్, సినిమాల్లో చూపించినట్టే రేప్ లు చేస్తే, మర్డర్లు చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఈ మధ్య రాష్ట్రంలో కొంత మంది నరుకుతాం.. చంపుతాం.. రప్పా రప్పా తలలు తెగ్గోస్తాం.. అంటూ ఉన్మాదులులా ప్రవర్తిస్తున్నారని, క్రిమినల్స్ ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తారంటూ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు.

జగన్ రప్పా రప్పా డైలాగ్ వైరల్ గా మారింది, ఆ తర్వాత బాబు డైలాగ్ అంతకంటే వైరల్ గా మారింది. జగన్ వి క్రిమినల్ ఆలోచనలంటూ మండిపడ్డారు చంద్రబాబు. రాష్ట్రమంతా పాజిటివ్ గా యోగాంధ్ర అంటుంటే, దాన్నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి పర్యటనల పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. గతంలో ఇలాంటి పోకడ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా లేదని అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చంపేయండి, పొడిచేయండి అని చెప్పరని అన్నారు. ప్లకార్డులు చూసి ఆనందపడిపోవడమేంటని ప్రశ్నించారు. ఇది సమాజానికి ప్రమాదకరమైనది అన్నారు. విచిత్రమైన మనస్తత్వాలున్న వ్యక్తులు అలానే ఉంటారని అన్నారు. పోలీస్ లను, పబ్లిక్ ని తిట్టే నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు చంద్రబాబు.

మంత్రి లోకేష్ కూడా జగన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “రపరపా పొట్టేళ్లను నరికినట్టు నరుకుతారా జగన్, మీ అభిమాని భాషను మీరు సమర్థిస్తుండడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యానికి మీ ధోరణి చాలా ప్రమాదకరం” అంటూ ట్వీట్ చేశారు లోకేష్.

పుష్ప సినిమా డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు సెటైర్లు పేల్చే క్రమంలో ఈ రప్పా రప్పా డైలాగ్ ని విరివిగా వాడుతున్నారు నేతలు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×