BigTV English

Gold Mines in AP: ఆ కొండంతా బంగారమే.. ఈ టాక్ వెనుక అసలు మిస్టరీ ఇదే!

Gold Mines in AP: ఆ కొండంతా బంగారమే.. ఈ టాక్ వెనుక అసలు మిస్టరీ ఇదే!

Gold Mines in AP: ఆ కొండ వైపు ఆశగా చూసే కళ్లు కొన్ని. అదే కొండను చరిత్రకు సాక్ష్యంగా భావించి స్మరించే వారు కొందరు. కానీ ఈ కొండలో మాత్రం ఏదో ఉందన్న టాక్ మాత్రం నేటికీ వినిపించడం కామన్. అయితే ఇంతలా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆ కొండలో బంగారం ఉందన్న టాక్ ఎందుకో వినిపిస్తుందంటే.. పూర్వం ఇక్కడి పాలన తీరును బట్టి.. ఇక్కడ బంగారం ఉందన్న అభిప్రాయం అక్కడి స్థానికులలో కొందరిది. ఇంతకు బంగారపు కొండ టాక్ ఎక్కడ, ఏ జిల్లాలో వినిపిస్తుందో తెలుసుకుందాం.


ఇదొక ప్రాంతం పేరు కాదు.. చరిత్ర, ఊహ, ఆస్తి అన్నీ కలిసిపోయిన ఓ గొప్ప గాథ. కనిగిరి.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం గురించి ఇప్పటికీ చాలామంది ఇలా అంటుంటారు. ఈ కొండంతా బంగారమే! నిజంగానే అక్కడ బంగారం ఉందా? లేక అది కేవలం ఊహానా? అన్న ప్రశ్నల మధ్య, కనిగిరి చరిత్రలోకి ముడిపడిన అసలు కథ వేరే స్థాయిలో ఉంటుంది. కనిగిరి అనే పేరు అసలు కనకగిరి అనే పదం నుంచి ఉద్భవించిందని చరిత్రకారుల అభిప్రాయం. కనక అంటే బంగారం, గిరి అంటే కొండ. అంటే బంగారపు కొండ!

కొండలో బంగారం..
ఈ ప్రాంతాన్ని గతంలో శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు పాలించారు. ముఖ్యంగా కాకతీయుల కాలంలో కనిగిరికి వాణిజ్య పరంగా ఎంతో ప్రాధాన్యం ఉండేది. అప్పట్లో ఇక్కడ పలు ఖనిజ వనరుల గుర్తింపుతో పాటు, కొండల్లో ఖనిజాల తవ్వకాలు జరిగినట్లు కొన్ని శిలాశాసనాల్లో సైతం ప్రస్తావనలు ఉన్నాయి. అప్పటి నుంచే ఈ ప్రాంతం బంగారపు కొండగా పేరొందింది. అదేం కాక, ఇక్కడి కొండల శిలలు.. ముఖ్యంగా ఎరుపు, నలుపు రంగుల్లో మెరుస్తూ కనిపించేవి. వీటిలో క్వార్ట్జ్, ఫెల్డ్స్‌పార్ వంటి ఖనిజాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ఇది బంగారపు సూచనగా భావించవచ్చని స్థానికులు అంటుంటారు.


Also Read: TTD Latest News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుమలలో ఆల్ ఫ్రీ… ఫ్రీ!

ఇక్కడి ప్రజల నమ్మకమైతే మరీ విశేషం. ఈ కొండల్లో ఏదో ఉందనే అభిప్రాయం తరతరాలుగా సాగుతూ వచ్చింది. పల్లె పెద్దలు చెబుతుంటారు.. ఈ కొండలలో బంగారం దాగి ఉందని. కానీ ఇప్పటివరకు ఏ అధికారిక బంగారపు గనుల తవ్వకం జరగలేదు. అప్పుడప్పుడూ కొన్ని ప్రైవేట్ సంస్థలు పరిశీలనలకు వచ్చాయని వార్తలు వచ్చినా, అవి అక్కడే ఆగిపోయాయి.

ప్రస్తుతం కనిగిరి ఒక మండల కేంద్రంగా ఉంది. చుట్టుపక్కల గ్రామాలు వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నా.. అక్కడి కొండలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. చరిత్రపట్ల ఆసక్తి ఉన్నవారు కనిగిరిని సందర్శించి అక్కడి పర్వత వైభవాన్ని ఆస్వాదించవచ్చు. కొండల మధ్య ఆలయాలు, చిన్నపాటి అడవులు, ప్రశాంత వాతావరణం.. ఇవన్నీ కనిగిరిని ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర, అక్కడి ప్రజల నమ్మకం, చుట్టూ ఉన్న ప్రకృతి కలిపి కనిగిరిని ఒక అపురూప గాధలా చేస్తాయి. బంగారం ఉందా లేదా అనే విషయం కంటే, ఆ ఊరి చుట్టూ తిరిగినవారికి మాత్రం ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది ఈ కొండంతా బంగారమే.. అదేనండీ తరగని ఇక్కడి చరిత్ర బంగారం కంటే ఎక్కువ అని. మొత్తం మీద కనిగిరి లో నాటి రాజులు రాసులుగా బంగారం పోసి విక్రయించారన్న టాక్ మధ్య నేటికీ ఆ బంగారం నానుడి ఇక్కడ వినిపించడం కామన్. ఏదిఏమైనా బంగారం ఇక్కడ ఉన్నాలేకున్న, ఇక్కడి చరిత్ర మాత్రం ఓ అద్భుతమే!

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×