BigTV English

Chandrababu : నిధుల్లేని బీసీ కార్పొరేషన్లతో ఏం లాభం?.. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..

Chandrababu : నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి.. అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు. ఆదాయం పెంచే మార్గాలను సూచించానని బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో ఆయన మాట్లాడారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామని చంద్రబాబు అన్నారు. 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశామని తెలిపారు. 125 కులాలకు ఆర్థికసాయం చేసిన పార్టీ టీడీపీ అన్నారు. కార్పొరేషన్ల ద్వారా రూ.3,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన జగన్ నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్‌ ఇచ్చారా? అని బాబు ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి? ఆయన ప్రశ్నించారు. రూ.వందల కోట్ల విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసిందన్నారు. వాటిని తుప్పు పట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదని బాబు విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం రాగానే 34 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారని చంద్రబాబు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను రద్దు చేశారన్నారు. కనీసం బీసీ భవనాలను కూడా పూర్తిచేయలేకపోయారన్నారు. మూడు రాజధానులు కాదు.. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని.. దాన్ని పూర్తి చేసి తీరుతామని బాబు అన్నారు. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారని చంద్రబాబు నిలదీశారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×