BigTV English

Samantha: సమంతతో రొమాన్స్‌కు సిద్ధమైన బాలీవుడ్ స్టార్ హీరో..?

Samantha: సమంతతో రొమాన్స్‌కు సిద్ధమైన బాలీవుడ్ స్టార్ హీరో..?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘ఖుషి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పుడు ఆమె నెక్స్ట్ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఓ వార్త ఆమె అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ఆమె ఓ స్టార్ హీరో‌తో జోడి కట్టనున్నట్లు తెలుస్తోంది.


హీరో సల్మాన్ ఖాన్ – తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ కాంబినేషన్‌లో ‘ది బుల్’ అనే చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. 1988 ఆపరేషన్ కాక్టస్ అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ రివిల్ పోస్టర్‌ని రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంది. ఇదివరకు ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన త్రిష నటిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. అంతేకాకుండా ఇందులో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని కూడా టాక్ నడిచింది. ఈ తరుణంలో మరో వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీలో త్రిష స్థానంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంతను తీసుకోబోతున్నారట. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం త్రిష అజిత్, చిరంజీవి సినిమాలతో బిజీగా ఉండటంతో.. ‘ది బుల్’ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. అందువల్లనే ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిషను తప్పించి.. ఆమె స్థానంలో సమంతను తీసుకున్నట్లు సినీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×