BigTV English

US East Coast : అమెరికా తూర్పుతీరం కుంగుతోందా?

US East Coast : అమెరికా తూర్పుతీరం కుంగుతోందా?

US East Coast : అమెరికా అట్లాంటిక్ తీరంలోని భారీ కట్టడాలు కుంగిపోతున్నాయి. న్యూయార్క్, బాల్టిమోర్, నార్‌ఫోక్ తదితర మహానగరాల్లో సగానికిపైగా కట్టడాలు ఇదే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2100 నాటికి ప్రపంచంలోని గ్లేసియర్లలో 40 శాతానికి పైగా మాయమవుతాయని నాసా అంచనా. అంటే అవి కరిగిపోవడం ద్వారా సముద్రమట్టాలు 9 సెంటీమీటర్లు పెరిగే ప్రమాదం ఉంది.


తాజా పరిశోధనల ప్రకారం సముద్రనీటిమట్టాల పెరుగుదలతో అమెరికా తూర్పు తీర నగరాలను నీరు ముంచెత్తడమే కాకుండా భూమి కుంగుబాటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. తీరనగరాల్లో భూమి ఏ మేర కుంగుబాటుకు లోనవుతున్నదన్న అంశంపై ఆ పరిశోధన ప్రధానంగా దృష్టి సారించింది. న్యూయార్క్ వంటి మహానగరాలు కుంగిపోయే ప్రమాదం, తీర ప్రాంత ప్రజలపై దాని పర్యవసానాలు వంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

తుఫాన్లు, ముంపు వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్న ప్రధాన తీర నగరాలకు తాజాగా కుంగుబాటు ముప్పు మరో ప్రధాన సవాల్ కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2 వేల నుంచి 74 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో 14 కోట్ల జనాభాతో ఉన్న నగరాలు ఏటా 1-2 మిల్లీమీటర్లు కుంగిపోతున్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.


న్యూయార్క్, బాల్టిమోర్, నార్‌పోక్ వంటి నగరాల్లో దాదాపు 50 శాతం కట్టడాలకు ఈ కుంగుబాటు ముప్పు తప్పదని హెచ్చరించారు. అమెరికా అట్లాంటిక్ తీరం 5 మిల్లీమీటర్ల చొప్పున ఏటా కుంగిపోతోందని తెలిపారు. 2 మిల్లీమీటర్ల కుంగుబాటు ప్రభావం 21 లక్షల మందిపై, 8.67 లక్షల కట్టడాలపై ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. రాడార్ డేటాసెట్ల ఆధారంగా ఈ పరిశోధన సాగింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×