E-Paper
Advertisement

Chandrababu: ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి..

Chandrababu’s visit to Delhi: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు సమాచారం.

Chandrababu: ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి..
Advertisement

Chandrababu’s visit to Delhi: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు సమాచారం. బుధవారం రాత్రి అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న సమాచారం. కేంద్ర పెద్దలతో విడివిడిగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ టూర్‌ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన పేర్లు మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై బహిరంగ ప్రకటన చేయలేదని తెలుస్తోంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో పొత్తు మేలని బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

పొత్తుల అంశంపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల విజయవాడలో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలోనూ పలువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎవరిని కలుస్తారు? భాజపాతో పొత్తుపై స్పష్టత వస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.

Related News

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం ప్రకటన, ఏపీ రాజకీయాల్లో…

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Big Stories

Advertisement
×