BigTV English

Vande Bharat Express : భోజనంలో బొద్దింక.. ప్రయాణికుడు ఫైర్.. ఐఆర్‌సీటీసీ రియాక్షన్..

Vande Bharat: కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైళ్లలో అందిస్తున్న ఆహారంపై ప్రయాణికులు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాసిరకమైన భోజనం పెడుతున్నారంటూ ఇప్పటికే పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Vande Bharat Express : భోజనంలో బొద్దింక.. ప్రయాణికుడు ఫైర్..  ఐఆర్‌సీటీసీ రియాక్షన్..

Man Found Cockroach in Vande Bharat Express food : కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైళ్లలో అందిస్తున్న ఆహారంపై ప్రయాణికులు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాసిరకమైన భోజనం పెడుతున్నారంటూ ఇప్పటికే పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.


తాజాగా ఫిబ్రవరి 2న మధ్యప్రదేశ్‌లోని రాణి కమలాపతి స్టేషన్‌ నుంచి జబల్‌పుర్‌ జంక్షన్‌కు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. సుభేందు కేసరి అనే వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఆయనకు ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించడంతో అసహనం వ్యక్తం చేశాడు.స్టేషన్‌లో దిగిన వెంటనే రాతపూర్వకంగా అక్కడి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన లేఖను, బొద్దింకతో ఉన్న ఆహారాన్ని ఫోటో తీసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.

ఈ ఘటనపై ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) స్పందించింది. ఈ ఘటన జరగడం తమకు బాధ కలిగించిందని తెలిపింది. దీనిపై బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఐఆర్‌సీటీసీ హామీ ఇచ్చింది. ఆ మార్గంలో ఆహార పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పడతామని ప్రకటించింది.


ఇటీవల ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఓ ప్రయాణికుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనకి ఇచ్చిన భోజనం నాసిరకంగా ఉంటటమే కాకుండా దుర్వాసన వచ్చిందని ఆ ప్రయాణికుడు ఆరోపించాడు. రైల్వే శాఖ నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని బాధితుడు తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్టు చేశాడు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియన్‌ రైల్వేస్‌, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలకు కూడా ట్యాగ్‌ చేశారు. భోజనం సరిగా లేదు కాబట్టి తాను చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని కోరాడు. దీంతో రైల్వే శాఖ అతనికి డబ్బును చెల్లించింది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×