OG Official Release date : పవన్ కళ్యాణ్ లైనప్‌లలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. అందులో దర్శకుడు సుజిత్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ బర్త్ డే కానుకగా.. ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలను మేకర్స్ పెంచేశారు. దీంతో దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఏదో అద్భుతం సృష్టిస్తున్నాడంటూ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురుచూడటం మొదలెట్టారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందా? అంటూ తహతహలాడుతున్నారు.
1950ల బ్యాక్‌డ్రాప్‌లో ముంబైలో గ్యాంగ్‌స్టర్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌ను ఏ సినిమాలో చూడని విధంగా ఇందులో మాస్ లుక్‌లో కనిపిస్తాడని తెలియడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో పవన్ కళ్యాన్ ఓ పాట కూడా పడనున్నట్లు ఆ మధ్య సంగీత దర్శకుడు తమన్ వెల్లడించాడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.
READ MORE : Pawan kalyan ‘OG’ movie update : ‘ఓజీ’లో పవన్ తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో..
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లైనప్‌లలో ఉన్న కొన్ని సినిమాలకు ఆయన డేట్స్ కేటాయించడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి కారణాలతో సినిమా ఎక్కడ ఆగిపోతుందోనని అభిమానులు చాలా కంగారు పడిపోయారు. అదీగాక ఈ మూవీ నుంచి ఒక్క టీజర్ తప్ప మరే ఇతర అప్డేట్స్ రాకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు.
అయితే ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరే సర్ప్రైజ్ అందించారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పవన్ స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. కూలింగ్ గ్లాసులు పెట్టుకొని చేతిలో టీ గ్లాస్ పట్టుకొని నిలబడిన పవన్ స్టిల్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది.