BigTV English

Chicken Rates: దడపుట్టిస్తున్న కోడి.. కిలో చికెన్ రూ.300..

Chicken Rates: దడపుట్టిస్తున్న కోడి.. కిలో చికెన్ రూ.300..

Chicken Rates in Andhra PradeshChicken Rates In Andhra Pradesh(Local news Andhra Pradesh): ఆంధ్ర ప్రదేశ్‌లో చికెన్ రేట్ కొండెక్కింది. కేజీ చికెన్ ధర రూ.300 పలుకుతుంది. దీంతో సామాన్యులు చికెన్ తినలేని పరిస్థితి ఎర్పడింది. మార్చి వరకు కోడి కొండమీదనే కూర్చోనున్నట్లు తెలుస్తోంది.


కోళ్ల ఉత్పత్తి దారుణంగా పడిపోవడమే చికెన్ రేట్లు పెరగడానికి కారణమని వ్యాపారులు తెలిపారు. కోడి మాత్రమే కాదు కోడి గుడ్డు కూడా కొండెక్కి కిందకు దిగనంటోందని తెలుస్తోంది. గుడ్డు ధర రూ.5 పైనే నడుస్తోంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కూడా చికెన్ రేట్లు పెరగడానికి ఒక కారణమని తెలుస్తోంది.

ఇటీవలే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెద్ద మొత్తంలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చికెన్ రేట్ సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగింది.


Read More: Drugs: మత్తు.. చిత్తు.. నగరంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ ..

కాగా కార్తీక మాసంలో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.120 నుంచి రూ.130 చొప్పున అమ్మాల్సి వచ్చిందని వ్యాపారులు వాపోయారు. దీంతో ఫారం యజమానులకు తీవ్ర నష్టాలు వచ్చాయి. అందుకే కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్లు పలువురు వ్యాపారులు పేర్కొన్నారు. దాని ఫలితంగా కోళ్ల కొరత ఏర్పడి.. చికెన్ రేట్ పెరగడానికి దారి తీసింది.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×