Big Stories

Drugs: మత్తు.. చిత్తు.. నగరంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ ..

Hyderabad drugs news

- Advertisement -

Hyderabad drugs news(Telangana today news): యువత జీవనవిధానం చాలా మారిపోయింది. పబ్ కల్చర్, పార్టీలు ఓ ఫ్యాషన్‌ గా మారిపోయాయి. లేట్ నైట్ పార్టీలు సర్వరాధారణమైపోయాయి. విచ్చలవిడిగా డ్రగ్స్ కు బానిసవుతున్నారు యువతీ, యువకులు. చిన్నవయస్సులోనే భారీ మొత్తంలో జీతాలు, ఇంటికి దూరంగా హాస్టల్స్ లో జీవించడం లాంటి జీవనవిధానంతో డ్రగ్స్ వాడకం అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. పబ్‌లు, పార్టీలతో యువతీ, యువకుల హల్ చల్ నిత్యకృత్యమైంది. ఆయా పార్టీల్లో మోతాదుకు మించిన మద్యానికి డ్రగ్స్ కూడా తోడవుతున్నాయి. పని ఒత్తిడి, తోటి వారి ప్రోద్బలం, చిన్నచిన్న ఎదురుదెబ్బలు, అపజయాలకు తట్టుకోలేని సున్నితత్వంతో యువత డ్రగ్స్ ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు మోసిన బడాబాబులు కూడా మాదకద్రవ్యాల బారినపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

- Advertisement -

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కలకలం రేగింది. అర్థరాత్రి హోటల్ లో పార్టీ జరగగా.. అందులో డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు పోలీసులు. పార్టీలో కొకైన్ సహా.. ఇతర మత్తు పదార్థాలు వాడినట్లు సమాచారం. బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు వివేకానంద్ తన స్నేహితులకు ఇచ్చిన ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో ఎంత మంది పాల్గొన్నారు? వీరికి డ్రగ్స్ సప్లై చేసినదెవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మూడు రోజులుగా వివేకానంద్, అతని స్నేహితులు హోటల్‌లో పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం.

Read More: నిర్దేశిత ల‌క్ష్యం మేర‌కు ప‌న్ను వ‌సూలు చేయాలి.. అధికారులను సీఎం రేవంత్ ఆదేశం..

డ్రగ్స్ కేసుల్లో అరెస్టులు జరుగుతున్నా.. దీన్ని పూర్తిగా అరికట్టడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజుల్లోనే రేవంత్‌ రెడ్డి దీనిపై ఫోకస్‌ పెట్టారు. తెలంగాణలో మత్తు మందు అనే పేరే వినపడకూడదని అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. దీని నియంత్రణ కోసం ప్రస్తుతమున్న తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోను మరింత పటిష్ట పరచాలని సూచించారు. టీఎస్ న్యాబ్‌లో ఖాళీల భర్తీకి కూడా సీఎం ఆమోదముద్ర వేశారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తరహాలో టీఎస్ న్యాబ్‌ను బలోపేతం చేస్తామని.. నార్కొటిక్ బ్యూరోకు ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. డ్రగ్స్ విషయంలో ఎవరినీ వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. సీఎం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఎక్కడికక్కడే తనిఖీలకు దిగారు. డ్రగ్స్ ముఠాలపై ఫోకస్ పెట్టి చైన్ లింక్‌పై ఆరా తీస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News