BigTV English

Chief Minister Chandrababu Naidu: ముఖ్యమంత్రిగానే వస్తానని ఆ రోజే చెప్పా.. చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

Chief Minister Chandrababu Naidu: ముఖ్యమంత్రిగానే వస్తానని ఆ రోజే చెప్పా.. చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

Andhra Pradesh assembly live updates(Political news in AP): అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానని.. ఆరోజే చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆనాడు నేను స్టేట్ మెంట్ ఇవ్వాలనుకున్నా.. కానీ నాకు మైక్ ఇవ్వలేదన్నారు. అందుకే ఆ రోజే చెప్పా.. ముఖ్యమంత్రిగానే వస్తానని వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చారు.


ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. సభలోనే ఆనాటి వైసీపీ ప్రభుత్వం దాడి చేసిందన్నారు. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రవర్తించిన విధానంపై బాధపడినట్లు చెప్పారు. కుటుంబంపై ఇష్టానుసారంగా మాట్లాడితే.. మైకు అడిగితే ఇవ్వకుండా చేసి అవమానపరిచిందన్నారు.

చట్టసభల్లో ప్రవర్తన, చర్చలు, వ్యాఖ్యలపై రాష్ట్రమంతా చూస్తుంటారని, శాసన సభ్యుడిగా సమర్థవంతంగా పనిచేయాలని చంద్రబాబు చెప్పారు. పవిత్రమైన శాసనసభలో గత ప్రభుత్వం నీచంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు.


మరో జన్మలో తెలుగువాడిగానే..
రాష్ట్రంలో ఆడపడుచులను అవమానించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు చేశారన్నారు. కానీ ప్రజలు నన్ను గౌరవించి మళ్లీ గౌరవసభకు పంపినట్లు చెప్పారు. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మరో జన్మ అంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలనేది నా కోరిక అటూ ఎమోషనల్ అయ్యారు.

ఎక్కడ తగ్గాలో..ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి..
2019 ఎన్నికల్లో 23 సీట్లు వస్తే.. దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారన్నారు. ఇవాళ కూటమికి 164 సీట్లు వచ్చాయని.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు అన్నారు. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారని, కానీ పవన్ 21 సీట్లలో గెలిపించుకున్నారన్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read: అయ్యన్నపాత్రుడు 40ఏళ్లుగా పసుపు జెండా మోస్తున్నారు.. అసెంబ్లీలో చంద్రబాబు

తొలిసారి మాట్లాడిన పవన్
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి అసెంబ్లీలో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషమన్నారు. ఇన్నాళ్లు మీ వాడివేడి చూశారని, ఇకపై రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారన్నారు. అయితే ఇకపై మీరు తిట్టే అవకాశం లేకపోవచ్చన్నారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందన్నారు. భాష మనసులను కలపడానికి.. విడగొట్టడానికి కాదన్నారు.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×