E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

థైరాయిడ్ వల్ల టిఫిన్ మానేస్తే ఆరోగ్య సమస్యలు.. హార్మోన్ కంట్రోల్ కోసం ఉదయాన్నే ఈ 3 అలవాట్లు పాటించండి

థైరాయిడ్ వల్ల టిఫిన్ మానేస్తే ఆరోగ్య సమస్యలు.. హార్మోన్ కంట్రోల్ కోసం ఉదయాన్నే ఈ 3 అలవాట్లు పాటించండి
Advertisement

థైరాయిడ్ సమస్య ఇటీవలి కాలంలో చాలా మందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారికి బరువు పెరగడం, అలసట, ఎనర్జీ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొందరు ఉదయం టిఫిన్ మానేస్తారు లేదా ఎక్కువసేపు ఆకలితో ఉంటారు. అయితే ఈ అలవాటు వల్ల థైరాయిడ్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వైద్య నిపుణుల ప్రకారం.. థైరాయిడ్ నియంత్రణకు ఆకలితో ఉండటం కాదు, క్రమబద్ధమైన జీవనశైలి అవసరం. ముఖ్యంగా ఉదయం చేసే కొన్ని మంచి అలవాట్లు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి.

1. థైరాయిడ్ మందును సరైన సమయంలో తీసుకోవాలి

Advertisement

థైరాయిడ్ రోగులు ఉదయం నిద్రలేవగానే ముందుగా డాక్టర్స్ చెప్పిన మందులు వేసుకోవాలి.

ఎలా తీసుకోవాలి?

టాబ్లెట్స్ మంచినీటితో మాత్రమే తీసుకోవాలి. టీ, కాఫీ లేదా ఇతర డ్రింక్స్‌తో తీసుకోవడం మంచిది కాదు.

ఎందుకు ముఖ్యం?

Advertisement

చాలామంది మందు వేసుకున్న వెంటనే టీ తాగడం లేదా టిఫిన్ చేయడం చేస్తుంటారు. దీని వల్ల శరీరంలో థైరాయిడ్ టాబ్లెట్స్ ప్రభావం సరిగా జరగదు. మందు తీసుకున్న తర్వాత కనీసం 30 నుంచి 45 నిమిషాలు ఏమీ తినకూడదు. ఇలా చేయడం వల్ల మందు ప్రభావం మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ల లెవెల్స్ సమతుల్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

2. ఆరోగ్యకరమైన టిఫిన్‌తో ఉదయం ప్రారంభించాలి

థైరాయిడ్ ఉన్నవారు ఉదయం టిఫిన్ మానేయడం పెద్ద తప్పు. ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల శరీరంలోని జీవక్రియలు మరింత మందగిస్తాయి. దీని వల్ల బరువు తగ్గడం కాకుండా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అలసట, బలహీనత కూడా పెరుగుతాయి.

టిఫిన్‌లో ఎలాంటి ఆహారం తినాలి?

ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం తీసుకోవాలి. పెసర పప్పు దోశ, వెజిటబుల్ పోహా, ఓట్స్, గంజి లేదా ఉడికించిన గుడ్లు మంచి ఆప్షన్స్.

ఏవి తినకూడదు?

అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదాతో చేసిన ఆహారాలు, ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవద్దు. కడుపు నిండా టిఫిన్ చేయడం మంచిది.

3. ఉదయం సూర్యరశ్మి, వ్యాయామం

థైరాయిడ్ నియంత్రణలో శారీరక వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం శరీరానికి కేటాయించాలి. ఉదయం లేత ఎండలో వాకింగ్, రన్నింగ్ లాంటి శారీరక శ్రమ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఉదయం 15 నుంచి 20 నిమిషాలు వేగంగా నడవాలి. లేత సూర్యరశ్మిలో కొంతసేపు గడపాలి. యోగా, ప్రాణాయామం వంటి వ్యాయామాలు కూడా చేయవచ్చు.

Also Read: ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి? మంచి జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలు తప్పనిసరిగా చూడాలి

ఈ అలవాట్లతో కలిగే ప్రయోజనాలు

ఉదయం వేళ్ల లభించే సూర్యరశ్మి వల్ల శరీరానికి సహజంగా ‘విటమిన్ డి’ లభిస్తుంది. ఇది థైరాయిడ్ పనితీరుకు ఉపయోగపడుతుంది. వ్యాయామం జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అలాగే బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్ లెవెల్స్ కూడా తగ్గించడంలో సహకరిస్తుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఆకలితో ఉండకూడదు. సరైన సమయంలో మందు తీసుకోవడం, ఆరోగ్యకరమైన టిఫిన్ చేయడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
ఉదయాన్నే పాటించే ఈ మూడు అలవాట్లు థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యంగా ఉంచి, బరువు నియంత్రణలో సహాయపడతాయి.

గమనిక: వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్య నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Related News

బాగా చెమట పట్టేంత వ్యాయామం చేసినా ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే

వర్షాకాలంలో ఈ దుస్తులు అసలు ధరించకూడదు.. దురద, అలర్జీకి ఇవే కారణం

మీరు రోజూ ఉపయోగించే ఈ మేకప్‌ ఆరోగ్యానికి చాలా హానికరం.. క్యాన్సర్ వచ్చే అవకాశం

మీ పిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఈ మంచి అలవాట్లు నేర్పించండి..

ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి? మంచి జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలు తప్పనిసరిగా చూడాలి

బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? సాయంత్రం ఆకలి వేస్తే ఈ ఫుడ్స్ తినడం బెస్ట్

మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెరగడం లేదా? ఖర్చు లేకుండా ఇలా చేస్తే తీగలు తీగలుగా పెరుగుతుంది

Big Stories

×