BigTV English

Tadipatri incident : సీఐ సూసైడ్ కలకలం.. తాడిపత్రిలో రాజకీయ వివాదం!

Tadipatri incident :  సీఐ సూసైడ్ కలకలం.. తాడిపత్రిలో రాజకీయ వివాదం!
Tadipatri incident


Tadipatri incident : తాడిపత్రి సీఐ ఆనందరావు.. ఆత్మహత్యపై వివాదం రాజుకుంది. టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్‌ ఫైట్‌ మొదలైంది. సీఐ ఆనందరావు.. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి. సీఐ ఆనందరావు ఫ్యామిలీని జిల్లా ఎస్పీతో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.

సీఐ ఆనందరావు.. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. సీఐ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అంతగా కష్టం ఏమొచ్చింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారింది.


జేసీ ఫ్యామిలీ వర్సెస్‌ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య.. నిత్యం వార్‌ నడుస్తుంటుంది. తరుచూ తాడిపత్రి రాజకీయం రచ్చగా మారుతుంటుంది. ఎప్పుడూ పొలిటికల్ టెన్షన్ ఉండే ఏరియా. అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. సీఐ పని ఒత్తిడి కారణంగానే ప్రాణాలు తీసుకున్నాడా? మరెదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

జిల్లా ఎస్పీ మాత్రం.. కుటుంబ కలహాల కారణంగానే చనిపోయారని చెబుతున్నారు. రాత్రి గొడవ జరిగిందని.. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. వృత్తిపరంగా ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు.

కుటుంబ సభ్యుల వెర్షన్‌ మరోలా ఉంది.. కేవలం పని ఒత్తిడితోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదన్నారు. తాడిపత్రిలో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందని హ్యాండిల్ చేయలేకపోతున్నానంటూ తరచూ తన తండ్రి బాధపడ్డారని చెప్పింది సీఐ కూతరు భవ్య. సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×