Rayalaseema: ఏపీలో ఈ ఉదయం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు పోలింగ్ జరుగుతోంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అలు వినుకొండలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా పులివెందులలో పోలింగ్ రోజు గొడవలు జరుగుతున్నాయి. తాజాగా పులివెందుల పట్టణంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ-వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పొడవైన కర్రలు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. దీని వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది.
ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను.. ఛైర్మన్ అభ్యర్థిని అడ్డుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం కాస్త తీవ్రమైంది. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చివరకు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఫలితంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ALSO READ: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.. పులివెందులలో హింస మొదలు, వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు
ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో హై టెన్షన్ నెలకొంది. హింసను ప్రేరేపిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా ఇంటిని చుట్టుముట్టారు. వినుకొండను వదిలి వెళ్లాలని బొల్లాకు నోటీసులు ఇచ్చారు. నన్నే వెళ్లిపొమ్మంటారా అంటూ పోలీసులపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్ అయ్యారు.
తనను అరెస్టు చేసి నరసారావు పేట తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయడు చెప్పుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అక్కడ ఉంచారని ఆరోపించారు. అన్యాయం జరుగుతుంటే అక్కడ ఉంచకుండా తనను తరలించారని మండిపడ్డారు. ఆయనకు ఒక న్యాయం, నాకు మరొక న్యాయమా? అంటూ రుసరుసలాడారు.
విజయవాడ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు అయ్యాయి. వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదురుగా హస్తం గుర్తు ఉంది. ఇదే కాకుండా వివిధ డిజివిన్లలో బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో వైసీపీ అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా 55 డివిజన్ లో పోలింగ్ నిలిపి వేశారు ఆర్వో చక్రవర్తి. కొత్తగా బ్యాలెట్ పేపర్లు ముద్రించిన తర్వాత పోలింగ్ మొదలు కానుంది. ఈ క్రమంలో సుమారు 2 గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కానుంది.
పులివెందులలో ఉద్రిక్తత..
పులివెందులలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను, ఛైర్మన్ అభ్యర్థిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కేంద్రం… pic.twitter.com/5xDznlUhgL
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2026
వినుకొండలో హైటెన్షన్
మాజీ ఎమ్మెల్యే బొల్లా ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు
వినుకొండ వదిలి వెళ్లాలని బొల్లాకు నోటీసులు
నన్నే వెళ్లిపొమ్మంటారా అంటూ బొల్లా ఫైర్
జీవీ ఆంజనేయులుకు ఒక న్యాయం.. నాకొక న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బొల్లా
భారీ బందోబస్తు మధ్య నరసరావుపేటకు బొల్లా తరలింపు… pic.twitter.com/E7Zv69c5iC— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2026