Amaravati: తమిళనాడు సీఎం విజయ్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయా? జాతీయ పార్టీల నేతలు సీఎం విజయ్‌ని కలవడం వెనుక ఏం జరిగింది.. జరుగుతోంది? ఒక్కరోజు గ్యాప్‌లో సీఎఎం చంద్రబాబుతో సీఎం విజయ్ సమావేశం కావడం వెనుక సంకేతాలు ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. మంగళవారం సీఎం విజయ్ ఏపీ రానున్న నేపథ్యంలో వైసీపీ మరొక ప్రశ్న రైజ్ చేస్తోంది. మరి డిక్లరేషన్ మాటేంటని ప్రశ్నిస్తోంది.
తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం అనగా ఇవాళ ఏపీకి రానున్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0’లో పాల్గొనాలని ఇటీవల సీఎం విజయ్‌ను ఏపీ ఎంపీలు కలిసి ఆహ్వానించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన ఏపీకి రానున్నారు. ఆయన రాక సందర్భంగా విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. మంగళవారం మధ్యాహ్నం 4.00 గంటలకు చెన్నై నుంచి గన్నవరం చేరుకోనున్నారు సీఎం విజయ్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కనకదుర్గ ఆలయానికి వెళ్తారు.
సాయంత్రం 5.00 గంటలకు కనక దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకుంటారు. దేవాలయంలో దాదాపు 45 నిమిషాలు సేపు గడపనున్నారు. దర్శనం తర్వాత సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గంలో అమరావతి వెళ్తారు. ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని చంద్రబాబుతో ఆయన భేటీ కానున్నారు. నేతల భేటీలో చెన్నైకి రావాల్సిన తాగునీటి గురించి సీఎం చంద్రబాబు వద్ద తమిళనాడు సీఎం ప్రస్తావించనున్నారు.
ఎల్‌నినో తరుణంలో చెన్నై నగరానికి తాగునీటి సమస్యను వివరించనున్నారు. రాత్రి 6 నుంచి 7 గంటల మధ్యలో ఇద్దరు సీఎంలు గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి చర్చించనున్నారు. ఈ విషయమై ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో చర్చించిన అంశాన్ని సీఎం చంద్రబాబు.. సీఎం విజయ్ దృష్టికి తేనున్నారు. దక్షిణాది రాష్ట్రాలు నీటితో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు కూడా.
తమిళనాడులో నీటి సమస్య పుల్‌స్టాప్ పెట్టేందుకు ఇదొక అవకాశమని చెప్పనున్నారు. అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి ఇంటి నుంచి ఉత్సవ్ గ్రౌండ్‌కు వెళ్తారు సీఎం విజయ్. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని పరిశీలించనున్నారు. రాత్రి 8 గంటలకు ఉత్సవ్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లనున్నారు. సీఎం విజయ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ క్రమంలో సీఎం విజయ్ డిక్లరేషన్ ఇస్తారా? అంటూ వైసీపీ నేతలు, శ్రేణులు పలు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.
ALSO READ: ఏపీకి దసరా ముసురు.. అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనంగా మారే ఛాన్స్
గతంలో వైసీపీ అధినేత జగన్ ఎక్కడకు వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి నేతలు పట్టుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. డిక్లరేషన్ అనేది కేవలం టీటీడీ వరకు మాత్రమే అమలు చేస్తున్నారని, మిగతా చోట్ల లేదని అంటున్నారు. టీటీడీ ప్రత్యేక పాలకమండలి ఉండడమే కారణంగా చెబుతున్నారు. విజయవాడ ఎంపీలు ఆహ్వానం మేరకు ఉత్సవ్‌కు వస్తున్నారని దానికేమీ డిక్లరేషన్ అవసరం లేదన్నది టీడీపీ నేతల మాట.
Tamil Nadu CM Vijay’s schedule for his visit to Vijayawada pic.twitter.com/Oo2rEN7fkk
— Actor Vijay Team (@ActorVijayTeam) October 13, 2026