E-Paper
Advertisement

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వల.. రూ.20 లక్షల లంచం కేసులో తహశీల్దార్, సర్వేయర్ అరెస్ట్

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వల.. రూ.20 లక్షల లంచం కేసులో తహశీల్దార్, సర్వేయర్ అరెస్ట్
Advertisement

Abdullapurmet ACB Raid: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పడగ విప్పింది. లేఅవుట్ జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి ఏకంగా రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేసిన తహశీల్దార్, మండల సర్వేయర్‌లను యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

రూ. 30 లక్షల నుంచి బేరం కుదిరిందిలా..

Advertisement

బాధిత నియోజకవర్గ వాసి నుంచి లేఅవుట్ సర్వే నివేదిక కోసం మొదట రూ. 30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. బాధితుడు వేడుకోవడంతో చివరకు రూ. 20 లక్షలకు ఒప్పందం కుదిరింది. తహశీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకే మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు ఈ భారీ మొత్తాన్ని లంచం రూపంలో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సర్వేయర్ చేతివేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షలో నిర్ధారణ పాజిటివ్‌గా తేలింది.

అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు

Advertisement

పట్టుబడిన అధికారుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు నివాసాలలో అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాలలో పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రత్యేక కోర్టుకు నిందితులు

లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. సోమవారం నాడు నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. రెవెన్యూ రంగానికి గుండెకాయ లాంటి తహశీల్దార్ కార్యాలయంలోనే ఏసీబీ దాడులు జరగడం, కోట్లలో కాకపోయినా లక్షల్లో లంచాలు తీసుకోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.

Also Read: ORRపై ఘోర ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి!

Tags

Related News

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

ఏం పీక్కుంటారు అన్న కేటీఆర్ ఇప్పుడు గడగడ వణికిపోతున్నాడు!- ఆది శ్రీనివాస్

ORRపై ఘోర ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి!

హైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

కన్న కూతురిపై తండ్రి.. భర్తను చెట్టుకు కట్టేసి భార్య ఏం చేసిందంటే.. సిద్ధిపేటలో దారుణం!

పిల్లలు చూస్తుండగానే.. భార్యని ఆ పని చేసిన భర్త, రంగారెడ్డి జిల్లాలో ఘటన

మరీ ఇంత అవినీతా.. రూ.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

Big Stories

Advertisement
×