E-Paper
Advertisement

ఒకే ట్రాక్‌పై భారత్, జపాన్ బుల్లెట్ రైళ్లు నడుస్తాయా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?

ఒకే ట్రాక్‌పై భారత్, జపాన్ బుల్లెట్ రైళ్లు నడుస్తాయా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Advertisement

India–Japan Bullet Trains on One Track: భారత్ లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్న వేళ, భారతీయ బుల్లెట్ రైళ్లు, జపాన్ షింకన్సెన్ రైళ్లు ఒకే ట్రాక్‌పై నడపవచ్చా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌ లో వేర్వేరు టెక్నాలజీలతో కూడిన రైళ్లను నడపాలంటే ముందుగా భద్రత అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని జపాన్‌కు చెందిన రైల్వే నిపుణుడు మసఫుమి షుకూరి స్పష్టం చేశారు. ప్రయాణికులతో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే ముందు పూర్తిస్థాయి ట్రయల్స్ నిర్వహించడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.

రెండు రకాల బుల్లెట్ రైళ్లు నడపడం సాధ్యమేనా?

ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌లో దేశీయంగా తయారైన రైళ్లతో సేవలను ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, ఈ ప్రాజెక్టులో జపాన్ షింకన్సెన్ టెక్నాలజీ కూడా కీలకంగా ఉంది. అయితే, రెండు రైళ్లలో వేర్వేరు సిగ్నలింగ్ వ్యవస్థలు ఉంటే, అవి ఒకే ట్రాక్‌పై సురక్షితంగా పనిచేస్తాయా? అనే అంశాన్ని ముందుగా పరిశీలించాలి. ఒకే హైస్పీడ్ రైలు మార్గంలో రెండు వేర్వేరు రైలు వ్యవస్థలు, వాటి సిగ్నలింగ్ టెక్నాలజీలతో పనిచేసిన ఎగ్జాంపుల్స్ తనకు తెలియదని షుకూరి తెలిపారు. అందువల్ల భద్రత, సాంకేతిక అనుకూలతపై స్పష్టత వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు కీలకం?

Advertisement

బుల్లెట్ రైళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది. రైళ్ల కదలికలను నియంత్రించడం, వాటి మధ్య సురక్షితమైన దూరాన్ని మెయింటెయిన్ చేయడం లాంటి బాధ్యతలను మెయింటెయిన్ చేస్తుంది. రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్, నిర్వహణ వ్యవస్థలు అన్నీ సమన్వయంతో పని చేయాలి. రైళ్లను కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, సిబ్బందికి శిక్షణ, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ ఏర్పాట్లు, ట్రయల్స్ కూడా అవసరమని చెప్పారు.

2027లో తొలి సెక్షన్ ప్రారంభం

సుమారు 500 కిలోమీటర్ల పొడవైన ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు మొదట 2022లో పూర్తికావాల్సి ఉంది. అయితే, భూసేకరణ సమస్యలు, కరోనా మహమ్మారి కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం తొలి సెక్షన్‌ను 2027లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జపాన్‌లో 1964లో తొలి షింకన్సెన్ రైలు ప్రారంభమైంది. హైస్పీడ్ రైళ్ల నిర్మాణం, నిర్వహణలో ఆరు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.

చివరికి ఏ రైలు వ్యవస్థను ఎంచుకుంటారు?

Advertisement

భారత్ దేశీయ రైళ్లను ఎంచుకోవాలా? జపాన్ టెక్నాలజీనే కొనసాగించాలా? అనే విషయంపై షుకూరి ఎలాంటి సిఫార్సు చేయలేదు. ఈ నిర్ణయం భారత్, జపాన్ ప్రభుత్వాల చర్చలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. మొత్తంగా, బుల్లెట్ రైలు ప్రాజెక్టులో వేగంగా సేవలు ప్రారంభించడం ఎంత ముఖ్యమో, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం కూడా అంతే ముఖ్యమని రైల్వే నిపుణులు స్పష్టం చేశారు.

Read Also: 24 కోచ్‌లతో కొత్త వందే భారత్ స్లీపర్.. అయ్య బాబోయ్ ఇన్ని సౌకర్యాలా?

Tags

Related News

ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే గుడ్ న్యూస్.. గుంతకల్ రైల్వే మార్గంలో మరో రెండు లైన్లు!

వందేభారత్ కు ఇక మరింత వేగం.. ఎన్ని కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుందంటే?

24 కోచ్‌లతో కొత్త వందే భారత్ స్లీపర్.. అయ్య బాబోయ్ ఇన్ని సౌకర్యాలా?

ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు!

కోల్‌కతాలోని రోడ్లకు ఇలా రంగులు ఎందుకు వేస్తున్నారు? దాని కోసమేనా?

ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గుంటూరు నుంచి స్పెషల్ రైలు!

వందే భారత్ సరికొత్త రికార్డు.. 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ సక్సెస్!

Big Stories

Advertisement
×