CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను క్లియర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయంచనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ భాగస్వామ్య మిత్రులకు బీజేపీ నుంచి వర్తమానం వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో కీలక నేతలంతా హస్తినకు బయలుదేరి వెళ్లారు.
ఎన్డీయే పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక రోజు ఢిల్లీ ఉండి ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు మంత్రి లోకేష్. దాని తర్వాత అమరావతికి వచ్చేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు స్వయంగా హాజరవుతున్నారు.
ఇలావుండగా గతరాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబును ఆయన నివాసం కలిశారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. ఇరువురు నేతలు దాదాపు అర్థ గంటపాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత గవర్నర్ గజపతిరాజు తన నివాసానికి వెళ్లిపోయారు. నేతలిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది వేరే అంశం.
ALSO READ: ఏపీలో మెడికల్ పాలిటిక్స్.. పీపీపీ పద్దతిలో కాలేజీల దశ మారుతుందా?
శుక్రవారం పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆర్థికమంత్రి మొదలు వివిధ శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను క్లియర్ చేసే అవకాశముందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును బ్రాండెక్స్ ప్రతినిధులు కలిశారు. అమెరికా ఆంక్షలు తర్వాత కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీనివల్ల టెక్స్ టైల్ సెక్టార్ ఇబ్బందులు పడుతుందన్నారు. దీనిపై ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో మాట్లాడి, దేశీయంగా మార్కెట్ పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
ఈ క్రమంలో ఢిల్లీలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు pic.twitter.com/YXITjNeSRP
— BIG TV Breaking News (@bigtvtelugu) September 12, 2025