ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. ఆయన పాలన మీద ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో అందరికీ తెలుసు. ముఖ్యంగా బాబు అండర్ లో పనిచేస్తున్న అధికారులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన్ను ఒక పనిరాక్షసుడిగా కొందరు అభివర్ణిస్తుంటారు. ఉదయం లేచిన మొదలు రాత్రి వరకూ ఎప్పుడూ ఏదో ఒక సమీక్షలు, ఫైల్స్ పరిశీలన, పెండింగ్ వర్క్స్ అప్డేట్స్ ఇలా ఏదో ఒక అంశం మీద చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఏ సమయంలో రివ్యూలు పెడతారో అధికారులకు కూడా ఒక్కోసారి సమాచారం ఉండదని గతంలో టాక్ వచ్చింది. ఉన్నపళంగా పలానా శాఖ మీద సమీక్ష ఉందని సమాచారం అందగానే అధికారులు ఆగమేఘాల మీద వస్తుంటారని, ఒక్కోసారి వారు ప్రిపేర్ అవ్వకుండా వచ్చి బాబుతో తిట్లు తింటారని చాలా సార్లు కథనాలు వచ్చాయి.
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీలు నిర్వహిస్తుంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం,పాలసీ, బిల్లు తీసుకొచ్చే క్రమంలో మంత్రివర్గం ఆమోదంతో దానిని అసెంబ్లీ ముందుకు లేదా ఆర్డినెన్స్ రూపంలో తెస్తుంటారు. అయితే, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో సాటి మంత్రులకు ఎజెండా కాపీలు ఇవ్వడం లేదని ఇటీవల ప్రభుత్వంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. మంత్రి నాదేండ్ల మనోహర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సీఎం చంద్రబాబు సీనియర్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దేనికైనా ఓ సిస్టమ్, ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందేనని సీఎంవో నుంచి సదరు సీనియర్ అధికారులకు క్లాస్ పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో మంత్రులు సైతం అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఎజెండా కాపీస్ అంశంలోనూ పరోక్షంగా మంత్రులకు సైతం సీఎం క్లాస్ పీకినట్టు తెలుస్తున్నది.కాపీస్ తమకు ఇవ్వడం లేదని ముందే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అడిగినట్టు తెలిసింది.దీనికి తోడు అసెంబ్లీ సమావేశాల్లో తమ తమ శాఖలకు సంబంధించి ప్రతిపక్ష వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి గరం అయినట్టు తెలుస్తోంది. అసలు శాఖ బాధ్యతలు సరిగా చూస్తున్నారా? లేదా? అని నిఘా వగ్గాలు, సంబంధిత శాఖ బాధ్యతలు చూస్తున్న అధికారుల నుంచి నివేదిక కోరినట్టు తెలుస్తోంది.మరోసారి ఇలాంటివ రిపీట్ అయితే అస్సలు సహించేది లేదని బాబు పలువురు మంత్రుల మీద ఫైర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
KCR : కేసీఆర్ బయటకు వచ్చి ఏం చెప్పబోతున్నారు?
పాలన విషయంలో రాజీ పడేది లేదని,సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మంత్రులే చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. దీనికి తోడు అధికారులు సైతం నిత్యం మంత్రులతో కో ఆర్డినెట్ చేసుకోవాలని హితవు పలికినట్టు సమాచారం. గత ప్రభుత్వం వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేసిందని, ఇప్పుడిప్పుడే వాటిని సరిచేస్తున్నామని.. అందుకే పాలనా వ్యవహారాల్లో ఎటువంటి తప్పులు దొర్లరాదని సీఎం గట్టిగా చెప్పినట్టు చర్చ జరుగుతున్నది.గత పాలకుల మీద కోపంతోనే ప్రజలకు కూటమి సర్కారుకు చాన్స్ ఇచ్చారని.. దానిని నిర్లక్ష్యం చేస్తే మరోసారి ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.