BigTV English

AP Assembly : ప్రాణ ప్రదాయిని పోలవరం.. మళ్లీ మొదటికొచ్చిన కథ.. ఏం చేయబోతున్నారు

AP Assembly : ప్రాణ ప్రదాయిని పోలవరం.. మళ్లీ మొదటికొచ్చిన కథ.. ఏం చేయబోతున్నారు

AP Assembly : సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. అనేక అంశాలపై మాట్లాడారు. పోలవరం, అమరావతి ఏపీకి రెండు కళ్లని తెలిపిన చంద్రబాబు.. వాటి నిర్మాణానికి ఎంతో కృషి చేశామని తెలిపారు. కానీ.. జగన్ అధికారం చేపట్టినప్పటి రాష్ట్రాన్ని విధ్వంసం వైపు నడిపించారంటూ ఆరోపించారు. అందుకు.. గణాంకాలు, లెక్కలతో చంద్రబాబు అనేక అంశాల్ని ప్రస్తావించారు.


పోలవరం ప్రాముఖ్యత తెలుసు కాబట్టే.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో దాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత.. పోలవరం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు రాకూడదనే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపామన్నారు. ఇందుకోసం.. ఆ మండలాలను ఇస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని కేంద్రం దగ్గర పోరాడానని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త ఆశాకిరణంగా నిలిచే పోలవరం ఫలితాల్ని రాష్ట్రమంతటా అందించేందుకు కృషి చేశామన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తికాక ముందే దాని సత్ఫఫలితాలు అందాలనే ఆలోచనతో పట్టిసీమను నిర్మించి, కృష్ణ డెల్టాకు నీరందించినట్లు సీసీఎం చంద్రబాబు వెల్లడించారు.


తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టులో 71.3 శాతం  పూర్తి చేశామని వెల్లడించిన సీఎం.. జగన్ హయంలో కేవలం 3.5 శాతం పనులే చేపట్టారని విమర్శించారు. గత పాలకులు, వారి విధానాలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు.. అనేక అంశాలను వివరించారు. నాయకులు మారతారని, అధికారులు మారిపోతారని.. కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం మారకూడదని సీఎం అన్నారు. ఎవరి చేతిలో అధికారం ఉన్నా.. మంచి చేయాలని సూచించారు. కానీ.. రాష్ట్రంలో అధికారం మారిపోయిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేపట్టి, ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని అన్నాారు. జగన్ చేసిన  పని బుద్ది తక్కువ పనంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏవైనా ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు చాలా ఆలోచించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎలాంటి ఆలోచనలు చేయకుండానే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పోలవరాన్ని ఆపేయాలని ఆదేశించడం అవివేకమన్నారు. వర్షాకాలంలో.. నదిలోని వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దేశంలో ఇంత ప్రమాదకరమైన నది ఎక్కడా లేదన్నారు. అందుకు తగ్గటే తాము ప్రణాళికలు రూపొందించామని.. తర్వాత వచ్చిన జగన్ అవగాహనా రాహిత్యం, విధ్వంసం, మూర్ఖత్వం కారణంగా పోలవరాన్ని ముంచేశారంటూ ఆగ్రహించారు.

జగన్ పాలనలో ఇరిగేషన్ రంగం భ్రష్టు పట్టిపోయిందని విమర్శించిన సీఎం చంద్రబాబు.. గత ఇరిగేషన్ మంత్రికి పోలవరంలో డయాఫ్రం వాల్ కనిపించలేదని చెప్పారని గుర్తు చేశారు. అయితే.. అందరికీ విషయం తెలియాల్సిన అవసరం లేదన్న సీఎం.. ప్రాణాధారమైన  ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశ్యం లేకపోవడమే దురదృష్టమన్నారు. పైగా.. అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చల సందర్భంగా ఇరిగేషన్ మంత్రులు.. అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. పాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకున్నా.. సభలో పర్సంటా, అర పర్సంటా అంటూ హేళనగా మాట్లాడారంటూ అనిల్ కుమార్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆ తర్వాత మరో మంత్రి వచ్చారని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఆయనకు టీఎంసీ’కి, క్యూసెక్ కి తేడా తెలియదంటూ వ్యాఖ్యానించారు.

డయాఫ్రమ్ వాల్ నాశనం..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన దగ్గర మట్టి చాలా మెతకగా ఉందని తెలిపిన సీఎం.. అందుకే అక్కడ డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా రెండు, మూడు సంస్థలు మాత్రమే ఇలాంటి వాల్స్ నిర్మించగలవని తెలిపిన సీఎం చంద్రబాబు.. జర్మనీకి చెందిన ప్రత్యేక కంపెనీ ద్వారా డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.  ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశామని వెల్లడించారు. కానీ.. జగన్ అధికారంలోకి రావడంతోనే పోలవరానికి ఇబ్బందులు మొదలైయ్యాయని అన్నారు. 15 నెలల పాటు పోలవరం ప్రాజెక్టు దగ్గర కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు కానీ.. ఎవరూ లేరని తెలిపారు. దాంతో తర్వాత వచ్చిన భారీ వరదల కారణంగా.. డయాఫ్రం వాల్ దెబ్బతిందని వెల్లడించారు. అయినా.. గత ప్రభుత్వం గుర్తించలేదని తెలిపారు.

Also Read : శాసనమండలిలో పవన్ కళ్యాణ్ మాట.. జై కొట్టిన వైసీపీ.. కొద్ది క్షణాలకే ఆ ఒక్క ట్వీట్ తో షాక్..

తాము అధికారంలో ఉన్నప్పుడు..  440 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించినట్లు తెలిపిన చంద్రబాబు.. జగన్ కారణంగా అవ్వన్నీ వృథాగా పోయాయని అన్నారు. ఇప్పుడు.. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నిపుణులు.. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిందని, దాన్ని మరమత్తులు చేస్తే రూ. 490 కోట్లు అవుతుందని అంటున్నారని తెలిపారు. జగన్ చేసిన పనికి.. మళ్లీ కొత్త డయాఫ్రం వాల్ చేపట్టాలని నిర్ణయించారన్నారు. ఇప్పుడు.. ఆ నిర్మాణాలకు 990 కోట్లు అవుతుంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిందన్న సీఎం.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×